మీ కారును ఆపేశారు. ఇంజిన్ కూడా ఆఫ్ చేశారు. ఇక అంతా నిశ్శబ్దమే అనుకుంటారు. కానీ కొద్దిసేపటికే బానెట్ కింద నుంచి టిక్.. టిక్.. టిక్.. అంటూ శబ్దం వినిపిస్తుంది. కొన్ని కార్లలో ఫ్యాన్ కూడా తిరుగుతూనే ఉంటుంది. మరికొన్ని కార్లలో డ్యాష్‌బోర్డ్ వెనుక నుంచి క్లిక్ అనే శబ్దం వస్తుంది. ఇలాంటి శబ్దాలు వినిపిస్తే చాలామంది కారు ఇంజిన్‌లో ఏదైనా సమస్య ఉందేమోనని భయపడతారు. కానీ ఈ శబ్ధం సమస్యకు మూలం కాకపోవచ్చు!. సాధారణంగా, ఆధునిక కార్లలో ఇంజిన్ ఆఫ్ చేసిన వెంటనే అన్ని వ్యవస్థలు పూర్తిగా ఆగిపోవు. కొన్ని భాగాలు కొద్దిసేపు తమ పని కొనసాగిస్తాయి. మీ ప్రయాణ సమయంలో కారు ఇంజిన్, ఎగ్జాస్ట్ వ్యవస్థ చాలా వేడెక్కుతాయి. ముఖ్యంగా క్యాటలిటిక్ కన్వర్టర్, ఎగ్జాస్ట్ పైపులు, హీట్ షీల్డ్స్ అధిక ఉష్ణోగ్రతకు చేరతాయి. కారు ఆపిన తర్వాత ఇవి నెమ్మదిగా చల్లబడతాయి. ఈ సమయంలో లోహ భాగాలు కుచించుకుపోతాయి. దాంతో టిక్.. టిక్.. అనే శబ్దం వస్తుంది. ఎండలో ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు ఈ శబ్దం మరింత స్పష్టంగా వినిపించవచ్చు. హైవే డ్రైవింగ్, వేగంగా నడపడం, బరువులు లాగడం వంటి సందర్భాల్లో కూడా ఇది ఎక్కువగా ఉండొచ్చు. శబ్దం క్రమంగా తగ్గి ఆగిపోతే సాధారణంగా ఆందోళన అవసరం లేదు. కారు ఆపిన తర్వాత కూలింగ్ ఫ్యాన్ తిరగడం కూడా సాధారణమే. ఆధునిక కార్లలో విద్యుత్ ఫ్యాన్లు ఉంటాయి. ఇంజిన్ ఇంకా వేడిగా ఉంటే, కారును నిలిపేసిన తర్వాత కూడా ఫ్యాన్ కొన్ని నిమిషాలు పనిచేస్తుంది. అయితే, ఫ్యాన్ చాలా సేపు ఆగకుండా తిరిగితే మాత్రం తప్పకుండా పరిశీలించాలి. దీని అర్ధం.. ఉష్ణోగ్రత సెన్సార్, రిలే లేదా కూలింగ్ వ్యవస్థలో సమస్య ఉండొచ్చు. ఫ్యాన్ ఎక్కువ సేపు తిరగడం వల్ల బ్యాటరీ కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు పరిశీలించేటప్పుడు.. ఇంజిన్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ ఫ్యాన్ అకస్మాత్తుగా తిరిగే అవకాశం ఉంది. కాబట్టి బానెట్ లోపల చేతులు పెట్టకూడదు. ఇది కూడా చదవండి: కొంతమంది తమ కారు సైడ్ మిర్రర్లకు పాలిథిన్ బ్యాగ్‌ను ఎందుకు కడతారు? అసలు కారణం ఇదే మరో ఆసక్తికరమైన విషయం - EVAP వ్యవస్థ. పెట్రోల్ ఆవిరి బయటకు వెళ్లకుండా కారు వాటిని నియంత్రిస్తుంది. కొన్ని కార్లు ఇంజిన్ ఆఫ్ చేసిన కొన్ని గంటల తర్వాత ఇంధన ఆవిరి లీక్ అవుతుందా అని ఆటోమేటిక్‌గా పరీక్షిస్తాయి. ఈ సమయంలో పంపులు, వాల్వులు పనిచేస్తాయి. దాంతో కారు కింద నుంచి స్వల్ప శబ్దం వినిపించవచ్చు. ఇది సాధారణ ప్రక్రియేనని కొన్ని కారు కంపెనీలు వెల్లడించాయి. డ్యాష్‌బోర్డ్ వెనుక క్లిక్ శబ్దం కూడా కొన్నిసార్లు సహజమే. ఏసీ వ్యవస్థలో, గాలి వెళ్లే మార్గాలను మార్చే చిన్న మోటార్లు ఉంటాయి. ఇంజిన్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి తమ స్థానాన్ని సరిచేసుకోవచ్చు. అప్పుడు క్లిక్ శబ్దాలు వస్తాయి. కానీ అదే శబ్దం పదేపదే గట్టిగా వినిపిస్తే యాక్చుయేటర్‌లో సమస్య ఉండొచ్చు. ఆధునిక కార్లలో ఎన్నో కంప్యూటర్ నియంత్రణ వ్యవస్థలు ఉంటాయి. కారు ఆపిన తర్వాత అవి వెంటనే పూర్తిగా ఆగిపోవు. సమాచారాన్ని భద్రపరచడం, తనిఖీలు చేయడం, ఇతర వ్యవస్థలను ఆపడం వంటి పనులు కొంతసేపు కొనసాగుతాయి. శబ్దంతో పాటు పొగ, ఆవిరి, కూలెంట్ లీక్, పెట్రోల్ వాసన, కాలిన వాసన లేదా ఓవర్‌హీటింగ్ హెచ్చరిక కనిపిస్