Kaizer News

Markapuram: మార్కాపురం ఎస్సీ హాస్టల్‌లో మంత్రి డోల

Markapuram: మార్కాపురం ఎస్సీ హాస్టల్‌లో మంత్రి డోలా ఆకస్మిక తనిఖీలు!

· State - Telangana · hmtvlive.com

Markapuram: మార్కాపురం లో ఎస్సీ సంక్షేమ హాస్టల్‌ను మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు టిఫిన్ ఆలస్యంగా పెట్టడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో పారిశుద్ధ్య నిర్వహణ, విద్యార్థులకు సకాలంలో యూనిఫామ్, స్వెటర్, నైట్ డ్రెస్సులు అందించకపోవడంపై వార్డెన్, డీడీపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎస్సీ హాస్టళ్లకు శానిటేషన్ సిబ్బందిని నియమించడంతో పాటు రూ.143 కోట్లతో మరమ్మతులు చేపట్టామని పేర్కొన్నారు. మంత్రితోపాటు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాయక్, మరియు సిబ్బంది పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News