హసన్‌పర్తి, ఆంధ్రప్రభ: పర్యావరణ పరిరక్షణతో పాటు రాబోయే తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రముఖ వైద్యులు సాయిని వెంకటేశ్వర్లు సూచించారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలోని ప్రొఫెసర్స్ కాలనీలో ఆదివారం స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. నూజివీడు నుంచి ప్రత్యేకంగా మొక్కలను తెప్పించి కాలనీని పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పచ్చదనం పెంపుతో సమాజానికి ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు. ప్రొఫెసర్స్ కాలనీని పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన హరితవనంగా మార్చేందుకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రొఫెసర్స్ కాలనీ అధ్యక్షుడు రమణయ్య, విశ్రాంత సివిల్ ఇంజనీర్ రామయ్య, బొక్క కుమార్, కిషోర్, పొన్నాల అరుంధతి మహేందర్‌రాజు, మణిదీప్‌రెడ్డి, శ్రీధర్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, పాపిశెట్టి కిరణ్, బాలరాజు, హరి, వేణుగోపాల్, బాబురావు, పావని తదితరులు పాల్గొన్నారు