Kaizer News

ఎస్‌బీఐ సహకారంతో బాసర ఆలయానికి మినీ బస్సు..

ఎస్‌బీఐ సహకారంతో బాసర ఆలయానికి మినీ బస్సు..

· State - Telangana · prabhanews.com

బాసర, ఆంధ్రప్రభ: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయానికి ఎస్‌బీఐ బ్యాంకు ఆర్థిక సహకారంతో మినీ బస్సు అందింది. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనీదేవి, స్థానిక బ్యాంకు అధికారులు, ఆలయ సిబ్బంది సమక్షంలో మినీ బస్సును ఆలయానికి అందజేశారు. అంతకుముందు ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసు శెట్టిని ఆలయ ఈవో అంజనీదేవి అమ్మవారి జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం మినీ బస్సుకు ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్‌ పాటక్‌, అర్చకులు మురళీ శ్రోతి, వేద పండితులు నవీన్‌ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అంజనీదేవి మాట్లాడుతూ బాసర ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మినీ బస్సును వినియోగించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు బస్సును ఉపయోగిస్తామని పేర్కొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News