Kaizer News

ఆందోళన రేపుతున్న అధికార మార్పిడులు

ఆందోళన రేపుతున్న అధికార మార్పిడులు

· National - India · sakshi.com

భారత జాతీయ అంతరిక్ష సంవర్ధన– ప్రాధికరణ సంస్థ (ఇన్‌–స్పేస్‌) ఈమధ్య వార్తలకెక్కింది. భారత అంతరిక్ష కార్యక్ర మాల భవిష్యత్తు గురించి ఆ సంస్థ చైర్మన్‌ పవన్‌ గోయెంకా చేసిన ప్రకటన వివాదా నికి కారణమైంది. దానిపై భారత అంత రిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన శాస్త్రవేత్తల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అంతరిక్ష పరిశోధనా సంస్థను ప్రైవేటీకరించే ప్రణాళికలు ఏవీ లేవని గోయెంకా వెంటనే ఖండన విడుదల చేశారు. అలాంటి సంశయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇస్రో కూడా స్పష్టం చేసింది. అయితే, ఈ ఉదంతం విధాన నిర్ణయాలలోని కీలకమైన లొసుగులను ఎత్తి చూపింది. ఆ లొసు గులు ఒక్క ఇస్రోలో మాత్రమే కాక, మొత్తం వైజ్ఞానిక సంస్థలన్నింటి లోనూ తీవ్రమైన పర్యవసానాలకు దారితీసేవిగా ఉన్నాయి. దేన్ని నియంత్రిస్తుంది? సైంటిస్టులను, శాస్త్ర–సాంకేతిక రంగానికి చెందిన పెద్దలను విశ్వాసంలోకి తీసుకోకుండా, వర్తమాన పరిస్థితులకు తగని విధంగా కేంద్ర ప్రభుత్వం ‘ఇన్‌–స్పేస్‌’ను ఏర్పాటు చేసింది. తొమ్మిది స్టాఫ్‌ యూనియన్లు సెప్టెంబర్‌ 4న రాసిన లేఖ ఆ సంగతిని ప్రతిబింబి స్తోంది. ఇన్‌–స్పేస్‌ను ఐదేళ్ళ క్రితం ఏర్పాటు చేశారు. కానీ, అది నిర్వహించే పాత్ర ఏమిటో ఇంతవరకూ స్పష్టం కాలేదు. ‘దోహదకారి–నియంత్రణ’ల పాత్ర రెండింటినీ నిర్వహించే దిగా దాన్ని కేంద్ర ప్రభుత్వ, ఇస్రో పెద్దలు అభివర్ణిస్తూ వస్తున్నారు. అంకుర సంస్థలకు ద్వారాలు తెరిచే ఏకగవాక్ష బిందువుగా దాని దోహదకారి పాత్రను అర్థం చేసుకోవచ్చు. కానీ, నియంత్రణ పదమే పక్కదోవ పట్టించేదిగా ఉంది. చట్ట బద్ధత కలిగిన నియంత్రణా చట్రం ఏదీ లేకుండానే ప్రైవేటు రంగ ప్రవేశానికి ప్రభుత్వం పురికొల్పింది. ఉపగ్రహాలకు కక్ష్యలో ప్రదేశాలను కేటాయించడం నుంచి భూమిపైన లేదా కక్ష్యలో ఏవైనా ప్రమాదాలు సంభవిస్తే బాధ్యత వహించడం నుంచి బీమా వరకు అంతరిక్ష కార్యకలాపాలలో అంతర్జాతీయ నియమ నిబంధ నలు చాలా ఉంటాయి. కనుక, తగిన నియంత్రణా వ్యవస్థ తప్పని సరిగా ఉండాలి. ఇస్రో ఒక అంతరిక్ష చట్టాన్ని మొదట 2015లో ప్రతిపాదించింది. దానిపై చర్చలు కొనసాగుతున్న సమయంలోనే, కేంద్ర ప్రభుత్వం ‘ఇన్‌–స్పేస్‌’ను ఏర్పాటు చేస్తూ 2023లో నూతన అంతరిక్ష విధానాన్ని ప్రకటించింది. ప్రైవేటు రంగం చేపట్టే అంతరిక్ష కలాపాలను నియంత్రించేందుకు ఒక సమగ్ర లీగల్‌ ఫ్రేమ్‌ వర్క్‌ను కల్పించేందుకు స్పేస్‌ బిల్లు ఎట్టకేలకు 2025లో సిద్ధమైంది. రెండూ ఒకే చేతులోనా? ఇన్‌–స్పేస్‌తో ఇతర సమస్యలూ ఉన్నాయి. అంతరిక్ష శాఖ (డాస్‌) కింద పనిచేసే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా దాన్ని వర్గీకరించారు. అదే శాఖ ఇస్రో పాలనా వ్యవహారాలను కూడా చూస్తోంది. ఒకవేళ ఇన్‌–స్పేస్‌ రెగ్యులేటర్‌గా వ్యవహరించదలిస్తే, ఇక్కడ ప్రయోజనాల ఘర్షణ ఇమిడి ఉంది. ఎందుకంటే, ఇస్రో చైర్మన్‌ ‘డాస్‌’కు కూడా కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ప్రతిపాదిత స్పేస్‌ చట్టం కింద రెగ్యులేటర్‌గా వ్యవహరించేందుకు ఇన్‌–స్పేస్‌ లీగల్‌ అథారిటీని పొందిందని అనుకుందాం. ఇప్పటిలాగా, అది చేయూతనిచ్చే సంస్థగా కూడా కొనసాగగలుగుతుందా? నియంత్రణ, వెసులుబాటు రెండూ ఒకరి చేతుల్లోనే ఉండకూడ దనేది ఒక తిరుగులేని సూత్రం. అందుకనే, 1990లలో టెలికామ్‌ రంగంలోకి ప్రైవేటు సంస్థల ప్

Original source: sakshi.com
Read more on Kaizer News