Kaizer News

నాదర్‌గుల్‌ భూములు.. బిగ్‌ హస్తగతం!

నాదర్‌గుల్‌ భూములు.. బిగ్‌ హస్తగతం!

· State - Telangana · ntnews.com

సర్వే నంబర్‌ 613లోని 274 ఎకరాలు అక్రమార్కుల చేతికి.. నంబర్‌-2 మంత్రిని సైడ్‌ చేసి రంగంలోకి దిగిన బిగ్‌ బ్రదర్‌ రాజీ కోసం అనుచరులతో రైతులకు బెదిరింపులు ఎకరాకు 30 లక్షల చొప్పున ఖేల్‌ ఖతం చేసిన అనుచరులు గతంలో ఎదురొడ్డి భూమిలో ఉన్న యాదయ్య సైతం బయటికి నిషేధిత జాబితాలో ఉన్నా చోద్యం చూస్తున్న రెవెన్యూ శాఖ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాదర్‌గుల్‌ భూములు ఇప్పుడు బిగ్‌ బ్రదర్స్‌ హస్తగతమైనట్టు తెలుస్తున్నది. దీంతో స్థానికంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వంలోని నంబర్‌-2 మంత్రి అనేక కంపెనీల రూపంలో ఆ భూముల్లో పాగా వేయలానుకున్నా తొలుత రైతాంగం అడ్డుకున్నది. దశాబ్దాలుగా సాగు చేసుకున్న ఈ భూములు తమవేనంటూ రైతుల నిరసనలు మిన్నంటిన చోట.. ఇప్పుడు మౌనం రాజ్యమేలుతున్నది. వారందరినీ అధికార, ధన బలం తో రాజీకి తెచ్చేలా ‘బిగ్‌’ అనుచరగణం ప్రయత్నించింది. చేతికి చిక్కని వారిని నయానో.. భయానో దారిలోకి తెచ్చుకున్నట్టు తెలుస్తున్నది. మొత్తంగా సర్వే నంబర్‌ 613లోని సుమారు 274 ఎకరాల భూమంతా ఇప్పుడు పూర్తిగా కార్పొరేట్‌ కంపెనీల వశమైంది. కానీ, ఈ క్షణానికీ ఆ భూములు రెవెన్యూ రికార్డుల్లో 22-ఏ నిషేధిత జాబితాలో రాష్ట్ర ప్రభుత్వ భూమిగానే ఉన్నది.మరోవైపు హైడ్రా సిబ్బంది, అధికార యంత్రాంగం ఆ దిక్కు చూసేందుకు దడుసుకుంటున్నది. స్పెషల్‌ టాస్క్‌బ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం (గతంలో సరూర్‌నగర్‌ మండలం)లోని సర్వే నంబర్‌ 613లో (పాత సర్వేనంబరు 119) 373.22 ఎకరాల భూమి కథ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికీ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్నా.. ప్రైవేట్‌ కంపెనీ స్వాధీనంలోకి వెళ్లిపోయాయి. అయినా ప్రశ్నించే నాథు డే కరువయ్యాడు. ఆ భూములను రక్షించే అధికారులు కనిపించకుండాపోయారు. జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి వాటిని ప్రైవేట్‌ భూములని చెప్పారని స్వయానా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ మీడియాకు చెప్పారు. కానీ అదే కలెక్టర్‌ స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు రాసిన నిషేధిత జాబితాల్లో 613 (119)లోని 373.22 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వ భూములుగా పొందుపరిచారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవి ప్రభుత్వ భూములే.. కానీ గతంలోనే ప్రైవేట్‌ కంపెనీలు వాటి చుట్టూ రేకులు వేశాయని చెప్పుకొస్తారు. ‘రేకులు ఎప్పుడు వేస్తే ఏమిటి? ప్రభుత్వ భూము ల్ని స్వాధీనం చేసుకోవచ్చుకదా?’ అనే ప్రశ్నకు మాత్రం ఏ ఒక్కరూ సమాధానం చెప్పడం లేదు. తెరవెనుక ప్రైవేట్‌ వ్యక్తులు నోట్ల కట్టలతో అమాయక రైతుల నోళ్లు మూయించి, ఆ భూములను రియల్‌ మార్కె ట్లో పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలంలోని సర్వే నంబర్‌ 613లో (పాత సర్వే నంబర్‌ 119) ఉన్న 373.22 ఎకరాలు ఖాస్రా పహాణీలో దస్తగర్దన్‌ భూమిగా నమోదై ఉన్నది. పట్టాదారు కాలమ్‌లో శివరాజ్‌ ఇలాకాగా నమోదు చేశారు. ఆ తర్వాత 1961-62, 1963-64, 1965-66, 1972-72ల్లో 355.12 ఎకరాలు ప్రభుత్వ భూమి (సర్కారి)గా నమోదవుతున్నాయి. భూ రికార్డుల నవీకరణ (ఎల్‌ఆర్‌యూపీ)లో 373.22 ఎకరాలు ‘కంచ సర్కారి’గా నమోదు చేశారు. దశాబ్దాలుగా రక్షిత కౌలుద

Original source: ntnews.com
Read more on Kaizer News