తెలుగు హీరో సుహాస్ ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించాడు. గత రెండేళ్లలో దాదాపు 10కి పైగా సినిమాల్లో కనిపించిన ఇతడు.. ఈ ఏడాది మాత్రం 'హే బల్వంత్' అని ఒకే మూవీతో వచ్చాడు. కామెడీగా ఉన్న ఈ చిత్రం పర్లేదనిపించింది. ఇక ఇదే ఏడాది తమిళంలోకి 'మండాడి'తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సెప్టెంబరు 10న ఇది తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో శుక్రవారం జరగ్గా.. ఇందులో సుహాస్.. హీరో సూరి కాళ్లు మొక్కాడు. (ఇదీ చదవండి: ఊపేస్తున్న 'ప్యారడైజ్' కొత్త పాట.. లిరికల్ వీడియో రిలీజ్ ) 'మండాడి' సినిమా విషయంలో తనకు అన్ని విధాల సూరి అన్న అండగా నిలిచాడని చెబుతూ సుహాస్ భావోద్వేగానికి గురయ్యాడు. స్టేజీపైనే అందరి ముందు కాళ్లు మొక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీని భిన్నమైన స్క్రీన్ ప్లేతో పూర్తిగా సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్టోరీగా తెరకెక్కించారు. తమిళం వరకు సూరి హీరో, సుహాస్ విలన్‌గా కనిపించనుండగా.. తెలుగులోకి వచ్చేసరికి సుహాస్ హీరోగా, సూరి విలన్‌గా కనిపించనున్నారట. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు మతిమారన్ పుళగెంది దర్శకుడిగా వ్యవహరించాడు. (ఇదీ చదవండి: అమ్మ జ్ఞాపకార్థం.. కొత్తింట్లోకి తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా ) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) సౌజన్య కేసులో సంచలనం జగదీశ్ రెడ్డి ఆస్తిపై కన్నేసిన సాధిక్ ఖాన్ తాగడానికి చుక్క లేదు ఇక బ్రతుకు భారమే.. ఎక్కడో తెలుసా ? 5 కోట్ల మంది మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే.. మీరు వాళ్ళని ఏం చేసారో తెలుసా బుడ్జోడి ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్.. ఆస్ట్రేలియా సిరీస్ లో నో ఛాన్స్.. అసలు కారణం ఇదే