Kaizer News

పొన్నం, మహేశ్‌గౌడ్‌కు ‘సర్‌’ నోటీసులు

· State - Telangana · ntnews.com

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా అధికార, రాజకీయ ప్రముఖులకు కూడా బీఎల్‌వోలు నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌కు బూత్‌లెవల్‌ అధికారులు (బీఎల్వోలు) నోటీసు జారీ చేశారు. ‘సర్‌'లో భాగంగా పొన్నం ప్రభాకర్‌ ఓటరు వివరాలను పరిశీలించిన బీఎల్వోలు జాబితాలో ఆయన తండ్రి పేరు తప్పుగా నమోదైనట్టు గుర్తించారు. దీంతో ఆ వివరాలను సరిచేయాల్సిందిగా నోటీసు జారీచేశారు

Original source: ntnews.com
Read more on Kaizer News