Shorts Nalgonda: నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు ఏర్పాటు చేయనున్న ఉచిత శిక్షణ తరగతులకు విశేష స్పందన లభించింది. శనివారం నిర్వహించిన ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 2,250 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 500 మంది అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నల్గొండలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ)లో ఉచిత శిక్షణ అందించనున్నారు. సబ్జెక్టు నిపుణులతో ప్రత్యేక బోధన, క్రమం తప్పకుండా మోడల్ టెస్టుల నిర్వహణతో పాటు సందేహాల నివృత్తికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దీనికితోడు రాతపరీక్షతో పాటు శారీరక దారుఢ్య (ఫిజికల్) పరీక్షలకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు