Shorts పోడూరు: పోషణ మహకార్యక్రమంలో భాగంగా పోడూరు మండలంలోని పాలకొల్లు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఉమా ఆదేశాల మేరకు పోడూరుగ్రామ సచివాలయంలోని మరియు జిన్నూరు సెక్టార్,ఎన్ ఆర్ పేట అంగన్వాడి సెంటర్ నందు మరియు గుమ్ములూరు సెక్టార్ అప్పి చెరువు కేంద్రం సెక్టర్ నందు గర్భవతులకు బాలింతలకు పౌష్టికాహారం గురించి. అంగన్వాడి కేంద్రం కు వచ్చే ప్రీస్కూల్ పిల్లలకు పెట్టే భోజనం నాణ్యత చూపిస్తూ వారికి పెట్టే మెనూ గురించి బాలింతలకు మునగాకు పొడి కరివేపాకు పొడి తప్పనిసరిగా ప్రతిరోజు వాడవలెను వాటి యొక్క ఉపయోగం గురించి, తల్లిపాల ప్రాధాన్యత సమతుల్యత ఆహారం పరిశుభ్రత ఆరోగ్య సంరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగినది. బాలింతలకు తల్లిలకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏసి డిపిఓ పి నాగరత్నం సూపర్వైజర్స్, కె.మోహన్ రాణి, జి.హేమ తులసి, ఎండి హసీనా, సెక్రెటరీ వెంకటలక్ష్మి, అమ్మి రాజు, ఏఎన్ఎం లు ఎం ఎల్ పిహెచ్ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు