Kaizer News

ట్రాక్టర్ కిందపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.. ఖమ్

ట్రాక్టర్ కిందపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.. ఖమ్మం జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ప్రమాదం

· State - Telangana · v6velugu.com

ఎర్రుపాలెం, వెలుగు : ట్రాక్టర్ కిందికి బైక్ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పెసరమల్లి నాగరాజు అలియాస్ జానీ (33), ఏపీలోని గంపలగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొరకొప్పుల రమేశ్ (45) బంధువులు. ఇద్దరూ కలిసి ఆదివారం బుచ్చిరెడ్డిపాలెంలో బంధువుల పెండ్లికి హాజరయ్యారు. అనంతరం బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామ శివారులోకి రాగానే వీరి బైక్ మట్టి లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ కిందికి దూసుకెళ్లింది. దీంతో నాగరాజు, పరమేశ్ అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు

Original source: v6velugu.com
Read more on Kaizer News