Kaizer News

Guntur: అణగారిన వర్గాల కోసం శ్రమించిన తొలి ఎంపీ అప

Guntur: అణగారిన వర్గాల కోసం శ్రమించిన తొలి ఎంపీ అప్పికట్ల జోసెఫ్!

· State - Telangana · hmtvlive.com

Guntur: స్వాతంత్య్ర సమరయోధుడిగా, తొలి రాజ్యసభ సభ్యునిగా, శాసన మండలి సభ్యునిగా అణగారిన వర్గాలకు విశిష్టమైన సేవలందించిన స్వర్గీయ అప్పికట్ల జోసెఫ్ 30 వ వర్ధంతి ఈనెల 31వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటలకు గుంటూరు లోని పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలో పూరిగుడిసెలో జన్మించిన అప్పికట్ల జోసెఫ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి విద్యను ఆయుధంగా మలిచిన సామాజిక సేవకునిగా ప్రజల మన్నలను పొందినారు. స్వతంత్ర పోరాటంలో జైలు జీవితం అనుభవించినారని, విజయవాడలో పాలకేంద్రం ఏర్పాటులోనూ, విజయవాడ రైల్వే ను వాణిజ్యపరంగా అభివృద్ధి కావడానికి రైల్వే జంక్షన్ గా తీర్చిదిద్దడంలోనూ విశిష్ట కృషి జరిపినారన్నారు. గొప్ప రాజకీయ సామాజిక సంస్కర్త గా పేరు గాంచిన స్వర్గీయ అప్పికట్ల జోసెఫ్ 30 వ వర్ధంతి సభలో ప్రధాన వక్తలుగా అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పి.వి. రమేష్, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, పూర్వ ప్రధమ వాణిజ్య అధికారి దక్షిణ మధ్య రైల్వే అప్పికట్ల భరత్ భూషణ్ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు. అణగారిన వర్గాల అభ్యున్నతిని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులు హాజరై సభను జయప్రదం చేయవలసిందిగా జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి విజ్ఞప్తి చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News