Kaizer News

ఆడియన్స్ రెస్పాన్స్‌‌‌‌తో పడిన కష్టం మర్చిపోయాం: ‘

ఆడియన్స్ రెస్పాన్స్‌‌‌‌తో పడిన కష్టం మర్చిపోయాం: ‘కికు చిరంజీవి’ టీం

· State - Telangana · v6velugu.com

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా శుభ సాయి వెంకట్ దర్శకత్వంలో దీప్తి నడిమింటి నిర్మించిన చిత్రం ‘కికు చిరంజీవి’. ఈ నెల 28న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని తెలియజేసింది టీమ్. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌లో కికు యనమల మాట్లాడుతూ ‘మా సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కడం సంతోషంగా ఉంది. ఇందులోని ఎమోషన్‌‌‌‌కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మేము పడిన కష్టం మర్చిపోతున్నాం’ అని అన్నాడు. ఈ సినిమాకొస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని దర్శకుడు శుభ సాయి వెంకట్, నిర్మాత దీప్తి అన్నారు. ఎడిటర్ చోటా కె ప్రసాద్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News