సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దశాబ్దాలుగా తీవ్ర కరువును ఎదుర్కొంటున్న మార్కాపురం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి ప్రారంభించి, నీటిని విడుదల చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంతంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు కొత్త జీవం లభించనుంది. ముఖ్యంగా 30 ఏళ్ల క్రితం, 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన […]