Kaizer News

లోకేష్ గారూ.. మీరిచ్చిన స్కూల్ బ్యాగులు చూడండి

లోకేష్ గారూ.. మీరిచ్చిన స్కూల్ బ్యాగులు చూడండి

· State - Telangana · prabhanews.com

చిరిగిన బ్యాగులు చెత్తకుప్పలో కనిపించడంపై గోపిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు నరసరావుపేట, ఆంధ్రప్రభ: గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా ఆదివారం 14వ వార్డులో పర్యటిస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి చెత్తకుండీ వద్ద చిరిగిపోయిన స్కూల్ బ్యాగులు కనిపించాయి. వాటిని గమనించిన ఆయన, కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన స్కూల్ బ్యాగుల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా చిరిగిపోయిన బ్యాగులను మీడియాకు చూపిస్తూ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగుల పరిస్థితి ఇదేనని విమర్శించారు. “లోకేష్ గారూ.. మీరిచ్చిన స్కూల్ బ్యాగులు ఒక్కసారి చూడండి” అంటూ ఎద్దేవా చేశారు. పిల్లలకు నాణ్యమైన బ్యాగులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు అందించిన బ్యాగులను పిల్లలు ఏడాది పొడవునా వినియోగించుకున్నారని గోపిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం పంపిణీ చేసిన కొన్ని బ్యాగులు చిరిగిపోయి చెత్తకుండీల్లో పడేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన వస్తువులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. చిరిగిపోయిన బ్యాగులు ఇప్పుడు పుస్తకాలు పెట్టుకోవడానికి కాకుండా చెత్త వేయడానికి పనికొస్తున్నాయంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విద్యార్థులకు సరఫరా చేసే వస్తువుల నాణ్యతపై ప్రభుత్వం సమీక్షించి, లోపాలు ఉంటే సరిదిద్దాలని డిమాండ్ చేశారు

Original source: prabhanews.com
Read more on Kaizer News