Kaizer News

Tadikal | అనారోగ్యంతో తాడికల్ సర్పంచ్ దుర్గపు సుజా

Tadikal | అనారోగ్యంతో తాడికల్ సర్పంచ్ దుర్గపు సుజాత మృతి

· State - Telangana · ntnews.com

Tadikal | ​శంకరపట్నం, సెప్టెంబర్ 20 : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత (35) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఆరోగ్యంగా ఉన్న ఆమె, వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచారు. ​మృతురాలికి భర్త తిరుపతి, నేవీలో ఉద్యోగం చేస్తున్న కుమారుడు, బీటెక్ పూర్తి చేసిన కుమార్తె ఉన్నారు. చిన్న వయస్సులోనే ప్రజాసేవలో ఉన్న సర్పంచ్ సుజాత అకస్మాత్తుగా మృతి చెందడంతో తాడికల్ గ్రామంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

Original source: ntnews.com
Read more on Kaizer News