Kaizer News

Adilabad Congress Group War: ఆదిలాబాద్ కాంగ్రెస్‌ల

Adilabad Congress Group War: ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు- డీసీసీ అధ్యక్షుడిపై బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు!

· State - Telangana · telugu.abplive.com

​ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నరేష్ జాదవ్‌ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు, విలువ ఇవ్వడం లేదని, నరేష్ జాదవ్ ప్రతి విషయంలోనూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ నేతలను విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన అధిష్ఠానం వద్ద తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ​శనివారం ఉదయం ఆడే గజేందర్ తన అనుచరులు, పార్టీ ముఖ్య కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. అక్కడ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను నేరుగా కలిసి జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ పీఏసీ కమిటీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై గజేందర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్ల ఎంపిక ప్రక్రియలో బోథ్ నియోజకవర్గానికి చెందిన ఆశావహుల పేర్లను పక్కనబెట్టి, డీసీసీ అధ్యక్షుడు తన ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ​జిల్లా అధ్యక్షుడి వ్యవహారశైలి వల్ల పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయని, క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆడే గజేందర్ అనుచరులు ఆరోపిస్తున్నారు. పార్టీ ప్రతిష్టను కాపాడటంతోపాటు సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే తక్షణమే జిల్లా అధ్యక్షుడిని మార్చాలని, పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే నేతకు జిల్లా పగ్గాలు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బోథ్ నియోజకవర్గ నేతల ఈ పర్యటన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. Up Next Up Next Up Next Up Next హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ! హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ హైదరాబాద్ హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ! విశాఖపట్నం విశాఖ జిల్లా చింతల అగ్రహారంలో నలుగురు ఆత్మహత్య! ఆటో డ్రైవర్ కుటుంబంలో విషాదం! హైదరాబాద్ హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్! ఫాస్టాగ్ నుంచే నేరుగా ఈ-చలాన్ కట్‌! పాలిటిక్స్ లోకల్ పోల్స్ బరిలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - డైరక్ట్ ఎలక్షన్స్‌ అడ్వాంటేజ్‌గా సాహసం చేస్తారా? ఓటీటీ-వెబ్‌సిరీస్‌ రెండు ఓటీటీల్లోకి లోకేశ్ కనగరాజ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే? ఎడ్యుకేషన్ విదేశాల్లో చదువులకు తెలంగాణ సర్కార్ సాయం.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిపించినా కెప్టెన్సీ, జ‌ట్టు నుంచి తొలగింపు.. అప్పటివరకు ఉంటాననుకున్నా.. సూర్య ఆటో మీ పాత కారును EVగా మార్చేయండి! రెట్రోఫిటింగ్ ప్రాసెస్,

Original source: telugu.abplive.com
Read more on Kaizer News