రేవంత్ హయాంలో అరాచక పాలన హైదరాబాద్‌లో గ్యాంగ్‌ల స్వైరవిహారం పోలీసుల పరిస్థితి అత్యంత దయనీయం కిందిస్థాయి పోలీసులే బలైపోతున్నరు జూబ్లీహిల్స్ పరిధిలో సంఘటన జరిగితే మేడిపల్లిలో కేసు ఎట్లా బుక్ అయింది? ముత్తుయాదవ్ ఏం పాపం చేసిండు? ఈ కేసులో డీసీపీ రమణారెడ్డిని, ఏసీపీ వెంకట్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదు హరికృష్ణ అనేవ్యక్తి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ కాలే అతన్ని కొట్టుకుంటూ ఎవరికో వీడియో కాల్‌లో కూడా బాధ్యులు చూపించారట! బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ హైదరాబాద్, ఆగస్టు 29, (నమస్తే తెలంగాణ): ‘రేవంత్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఆటవిక, అరాచక పాలన కొనసాగుతున్నది’ అని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. డీజీపీ మాత్రం శాంతిభద్రతలు కంట్రోల్‌లోనే ఉన్నాయంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రౌడీగ్యాంగ్‌లు స్వైరవిహారం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. వచ్చేది బీఆర్‌ఎస్ 0.3 ప్రభుత్వాన్ని చూస్తారని, ఇప్పుడు ప్రభుత్వానికి ఊడిగం చేస్తూ అరాచకం సృష్టిస్తున్న అధికారులకు, కల్లోలం సృష్టిస్తున్న నేతలకు తమ ప్రభుత్వ హయాంలో చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఈ నెల 20న మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్ వివరాలను ప్రవీణ్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్.. మేడ్చల్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హరికృష్ణను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ఉన్న ఒక డెన్‌కు పిలిపించి రాడ్లతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తీవ్రగాయాలైన బాధితుడిని దవాఖానకు పంపకుండా పోలీస్‌స్టేషన్లోనే నిర్బంధించారని, ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో జరిగితే మేడిపల్లిలో కేసు ఎలా బుక్ అవుతుందని ఆయన ప్రశ్నించారు. సీఎంపై కొండా సుస్మిత విమర్శలకు దిగగానే ఈ కేసును ఎందుకు ముందుకు తీసుకోచ్చారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసునని, ప్రభుత్వం ఈ కేసును రాజకీయ లబ్ధికి వాడుకొంటున్నదని తెలిపారు. కిందిస్థాయి పోలీసులే బలి సీఎం రాజకీయ చదరంగంలో కిందిస్థాయి అధికారులు, ముఖ్యంగా బహుజన వర్గానికి చెందిన అధికారులే బలైపోతున్నారని ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్‌లో బాధ్యతలు చేపట్టిన వారం రోజులకే సీఐ ముత్తుయాదవ్‌ను అకారణంగా సస్పెండ్ చేశారని, కానీ ఘటనకు బాధ్యులైన డీసీపీ రమణారెడ్డి, ఏసీపీ వెంకట్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిలదీశారు. అలాగే చిట్యాలలో ఒక విలేకరిపై దాడికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినందుకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీఐ మల్లేశ్‌ను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. తన మీద, తన పిల్లల మీద తప్పుడు ప్రసారాలు చేసిన ఒక చానల్‌పై అడిషనల్ డీజీ హోదాలో రిటైరైన తాను స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థలో తీవ్ర ఒత్తిళ్లు రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి అత్