Kaizer News

Gold Price Forecast Next Week | ప‌సిడి ధ‌ర‌లు పరుగ

Gold Price Forecast Next Week | ప‌సిడి ధ‌ర‌లు పరుగులు తీస్తుందా..? నేలచూపులు చూస్తుందా..?

· State - Telangana · prabhanews.com

ప‌సిడి ధ‌ర‌లు పరుగులు తీస్తుందా..? నేలచూపులు చూస్తుందా..? ఆగస్టు చివరి వారంలో బంగారం ధరలు గరిష్ఠాల నుంచి దిగొచ్చింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కఠిన వైఖరి, డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌ బలపడటం, లాభాల స్వీకరణతో పసిడి అమ్మకాలు త‌గ్గాయి. ఆగస్టు 31 నుంచి ప్రారంభమయ్యే వారంలో బంగారం ధరలు ఏ దిశగా కదులుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎంసీఎక్స్‌లో రూ.1.55 లక్షల సపోర్ట్‌, రూ.1.60 లక్షల రెసిస్టెన్స్‌ కీలకంగా మారాయి. అంతర్జాతీయంగా 4,500 డాలర్ల స్థాయి, అమెరికా ఉద్యోగ గణాంకాలు పసిడి తదుపరి దిశను నిర్దేశించనున్నాయి. ఇదే సమయంలో డిజిటల్‌ గోల్డ్‌ ధరలపైనా అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావం కనిపించనుంది. వచ్చే వారం బంగారం, డిజిటల్‌ గోల్డ్‌ ధరల పూర్తి విశ్లేషణ ఇదే. Gold Price Forecast Next Week | ఆంధ్రప్రభ వెబ్‌, బిజినెస్‌ ప్రతినిధి : పసిడి ధరల పరుగుకు ఆగస్టు చివరి వారంలో బ్రేక్‌ పడింది. వరుసగా పెరిగి నెల గరిష్ఠాలకు చేరిన బంగారం.. వారం చివర్లో ఒక్కసారిగా త‌గ్గుముఖం ప‌ట్టింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కఠిన వైఖరి, వడ్డీరేట్లపై మారిన అంచనాలు, డాలర్‌, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ బలపడటం, భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో పసిడిపై ప్ర‌భావం చూపించాయి. అంతర్జాతీయ స్పాట్‌ గోల్డ్‌ కూడా గణనీయంగా తగ్గడంతో దేశీయ మార్కెట్‌లోనూ ప్రతికూల ప్రభావం కనిపించింది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఆగస్టు 31 నుంచి ప్రారంభమయ్యే కొత్త వారంపైనే ఉంది. మరి పసిడి మళ్లీ పరుగులు తీస్తుందా..? లేక మరింత నేలచూపులు చూస్తుందా..? ఆగస్టు 24న 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర సుమారు రూ.16,397 వద్ద ఉండగా.. ఆగస్టు 29 నాటికి రూ.15,824కు చేరింది. అంటే కేవలం ఐదు ట్రేడింగ్‌ రోజుల్లోనే గరిష్ఠ స్థాయి నుంచి సుమారు రూ.573 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం కూడా గ్రాముకు రూ.15,030 నుంచి రూ.14,505కు దిగింది. తేదీ 24 క్యారెట్లు/గ్రాము 22 క్యారెట్లు/గ్రాము ధోరణి ఆగస్టు 24 రూ.16,397 రూ.15,030 గరిష్ఠాల సమీపం ఆగస్టు 26 రూ.16,375 రూ.15,010 దాదాపు స్థిరం ఆగస్టు 28 రూ.16,113 రూ.14,770 త‌గ్గుద‌ల‌ ఆగస్టు 29 రూ.15,824 రూ.14,505 భారీ పతనం దేశీయ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆగస్టు 25 న రూ.1,62,603 నుంచి వారం చివరికి సుమారు రూ.1,59,578కు తగ్గింది. ఎంసీఎక్స్‌లో అక్టోబర్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ శుక్రవారం 1.63 శాతం క్షీణించి రూ.1,56,400కు చేరాయి. పసిడి పతనానికి ప్రధాన కారణాల్లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వైఖరి ఒకటి. ద్రవ్యోల్బణంపై కఠిన వైఖరి కొనసాగవచ్చన్న సంకేతాలతో అమెరికా వడ్డీరేట్ల తగ్గింపుపై మార్కెట్‌ అంచనాలు బలహీనపడ్డాయి. ఫెడ్‌ రేట్లు అధికంగా కొనసాగితే అమెరికా డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌కు మద్దతు లభిస్తుంది. వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారంపై మాత్రం ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం కొనుగోళ్లకు బదులుగా అమ్మకాలు పెరిగాయి. ఇటీవల పసిడి వేగంగా పెరిగి రికార్డు స్థాయిలకు చేరడంతో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఫెడ్‌ నుంచి వచ్చిన కఠిన సంకేతాలు దీనికి ట్రిగ్గర్‌గా మారాయి. ఫలితంగా అంతర్జాతీయ స్పాట్‌ గోల

Original source: prabhanews.com
Read more on Kaizer News