Kaizer News

స్కూళ్లు తెరిచిన రోజే యూనిఫామ్‌: సీఎం

స్కూళ్లు తెరిచిన రోజే యూనిఫామ్‌: సీఎం

· State - Telangana · ntnews.com

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (నమస్తేతెలంగాణ): విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫామ్‌ మరింత ఆకర్షణీయమైన రంగు ల్లో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్‌, ఇతర సామగ్రిపై ఆయన శనివారం స మీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్స్‌ సూల్‌ పిల్లలకు ఒక జత యూనిఫామ్‌ పంపిణీ పూర్తయిందని, రెండో జత యూనిఫామ్‌ను నెలాఖరులోగా అందజేస్తామని అధికారులు తెలియజేశారు. కేజీబీవీ, మాడల్‌ సూల్‌ విద్యార్థులకు రెం డు జతల యూనిఫామ్‌లు అందజేసినట్టు తెలిపారు. విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు, సామగ్రి పంపిణీ పూర్తయిందని వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం స్కూళ్లు తెరిచిన రోజే యూనిఫామ్‌, ఇతర సామగ్రి విద్యార్థులకు అం దేలా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు

Original source: ntnews.com
Read more on Kaizer News