Kaizer News

OTT News: 'ఇరుముడి' ఓటీటీ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక

OTT News: 'ఇరుముడి' ఓటీటీ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే.?

· Entertainment · hmtvlive.com

OTT News: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'ఇరుముడి' ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకోవడంతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. థియేటర్లలో మంచి టాక్‌తో దూసుకుపోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించి సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 'ఇరుముడి' సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో అధికారికంగా స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. గతంలో 'నిన్ను కోరి', 'మజిలీ' లాంటి సూపర్ హిట్ ఎమోషనల్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన, ఈ సినిమాలో రవితేజను ఒక సరికొత్త కోణంలో ఆవిష్కరించారు. రవితేజ మార్క్ ఎనర్జీతో పాటు తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే బలమైన భావోద్వేగాలను దర్శకుడు ఎంతో హృద్యంగా తెరపై చూపించారు. హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ తన పాత్రలో చక్కటి నటనను కనబరిచారు. ముఖ్యంగా చిన్నారి బేబీ నక్షత్ర అద్భుతమైన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. సీనియర్ నటుడు సాయికుమార్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించి తన నటనతో మెప్పించారు. సుమారు రూ.50 కోట్లు బడ్జెట్‌తో అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఓటీటీ హక్కుల రూపంలోనే రూ.30 కోట్లు వరకు భారీ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా రూ. 150 కోట్ల వరకు వచ్చినట్టు సమాచారం. కాగా, ఈ డిజిటల్ రిలీజ్‌పై నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. 2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను

Original source: hmtvlive.com
Read more on Kaizer News