మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ పరిధిలోని చెంగిచర్ల మేకల మండి వద్ద ఆదివారం స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ మేకల మండికి భారీగా లారీలు వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. చెంగిచర్లలో రోడ్లు ఇప్పటికే ఇరుగ్గా ఉన్నాయని, మండికి ప్రతిరోజూ భారీ సంఖ్యలో లారీలు వస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుకైన రోడ్లపై లారీలు వేగంగా, అడ్డదిడ్డంగా తిరుగుతుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చెంగిచర్లకు చెందిన హరిబాబు చనిపోవడంతో ఆయన కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్‌చేశారు. ఆందోళనలో చెంగిచెర్ల డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఏర్పుల మహేశ్, స్థానికులు కొత్త సాయితేజ గౌడ్, బింగి జంగయ్యయాదవ్, గొరిగే నరసింహ కురుమ పాల్గొన్నారు