Kaizer News

Samantha | ప్రెగ్నెన్సీని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న

Samantha | ప్రెగ్నెన్సీని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న సమంత.. ఎన్ని కిలోలు పెరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..!

· Entertainment · ntnews.com

Samantha | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం జీవితంలో అత్యంత అందమైన దశను ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. తల్లికాబోతున్న ఆనందంలో ఉన్న సమంత.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో నిర్వహించిన ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌లో తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తన శరీరంలో వస్తున్న మార్పులు, బరువు పెరగడం, మాతృత్వం గురించి ఆమె ఎంతో ఓపెన్‌గా మాట్లాడారు. ప్రెగ్నెన్సీ కారణంగా బరువు పెరగడంపై ఒక అభిమాని చేసిన కామెంట్‌కు సమంత తనదైన శైలిలో స్పందించారు. తాను కూడా ఈ దశలో అనేక మార్పులను అనుభవిస్తున్నానని చెబుతూ, ఇప్పటికే తన బరువు సుమారు 11 కిలోలు పెరిగిందని వెల్లడించారు. అయితే ఈ మార్పులను చూసి ఆందోళన చెందకుండా, ప్రెగ్నెన్సీలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా స్వీకరిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. మాతృత్వ ప్రయాణం తనకు మొదట్లో కొంత కొత్తగా, తెలియని అనుభూతిగా అనిపించినప్పటికీ.. ఇప్పుడు మాత్రం తనలో ఎంతో ధైర్యం, కొత్త శక్తి వచ్చినట్లు సమంత అభిమానులతో పంచుకున్నారు. ఈ దశ తనను మరింత బలంగా మార్చుతోందనే భావనను ఆమె వ్యక్తం చేశారు. AMA సెషన్‌లో మరో అభిమాని పిల్లల సంరక్షణ గురించి చేసిన కామెంట్‌కు కూడా సమంత సరదాగా స్పందించారు. పిల్లలకు పాలు పట్టడం, వారిని చూసుకోవడం, నిద్రపుచ్చడం వంటి బాధ్యతలన్నీ చూస్తుంటే.. తల్లిగా ఉండటం నిజంగానే ఒక ఫుల్‌టైమ్ జాబ్‌లా అనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. మొదటిసారి తల్లికాబోతున్న సమంత ఈ కొత్త ప్రయాణాన్ని ఎంతో ఆసక్తిగా, ఆనందంగా స్వీకరిస్తుండటం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి వియత్నాంలో వెకేషన్‌ను ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బేబీ బంప్‌తో కనిపించిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందమైన లొకేషన్లలో డిన్నర్ డేట్స్‌ను ఆస్వాదిస్తున్న ఈ జంట ఫొటోలకు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రెగ్నెన్సీ గ్లోతో సమంత మరింత అందంగా కనిపిస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఫిట్‌నెస్‌కు ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చే సమంత.. ఈ ప్రత్యేక సమయంలో కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తూ అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News