Kaizer News

Kriti Sanon | కృతి సనన్ రాఖీ వివాదం.. యాడ్ తొలగించ

Kriti Sanon | కృతి సనన్ రాఖీ వివాదం.. యాడ్ తొలగించడానికి అసలు కారణం చెప్పిన జ్యువెలరీ బ్రాండ్

· Entertainment · ntnews.com

Kriti Sanon’s Rakhi Ad | ప్రముఖ నటి కృతి సనన్ నటించిన రక్షాబంధన్ ప్రకటన ఇటీవల తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జ్యువెలరీ బ్రాండ్ స్పందిస్తూ, ప్రకటనను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చింది. దుకాణాల వద్ద తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల వల్ల సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రాండ్ ఫౌండర్ ఇషేంద్ర అగర్వాల్ తెలిపారు. ప్రకటనలోని సందేశంపై తమకు ఇప్పటికీ నమ్మకం ఉందని, అయితే ఆన్‌గ్రౌండ్ స్టాఫ్ మరియు స్టోర్ల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ యాడ్‌లో కృతి సనన్ డీప్-నెక్, బ్రాలెట్-స్టైల్ బ్లౌజ్ ధరించి రాఖీ పండుగను జరుపుకోవడంపై సోషల్ మీడియాలో కొందరు తీవ్రంగా ట్రోల్ చేశారు. సంప్రదాయ పండుగకు ఈ దుస్తులు తగవంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో బ్రాండ్ అధికారికంగా ఆ యాడ్‌ను అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ప్రచార ఉద్దేశాన్ని వెనక్కి తీసుకున్నట్లు కాదని, కేవలం సిబ్బంది రక్షణ కోసమే ఈ చర్య తీసుకున్నామని ఫౌండర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. కుటుంబాలు మరియు పెంపుడు జంతువులతో కలిసి పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యాడ్ రూపొందించామని, కృతి సనన్ ఆలోచనతో తాము ఏకీభవిస్తున్నామని బ్రాండ్ పేర్కొంది. మరోవైపు, తన దుస్తులపై వస్తున్న విమర్శలకు నటి కృతి సనన్ కూడా గట్టిగా బదులిచ్చారు. సంస్కృతి, సాంప్రదాయాలు మనిషి గుండెల్లో ఉంటాయని, నెక్ లైన్‌లో కాదని ఆమె హితవు పలికారు. స్త్రీల దుస్తులను బట్టి వారి గౌరవాన్ని మించడం ఎప్పుడు మానివేస్తామని ఆమె ప్రశ్నించారు. ఈ వివాదంపై నటి కంగనా రనౌత్ కూడా స్పందిస్తూ విమర్శలు గుప్పించడం గమనార్హం

Original source: ntnews.com
Read more on Kaizer News