ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక!ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు ప్రకటించడం... తీర్పుపై తాను సుప్రీం కోర్టును ఆశ్రయించబోనంటూ ఆయన స్వయంగా ప్రకటించడంతో ఆరు నెలలలోపు ఉప ఎన్నిక జరగనుంది.