Kaizer News

రాజ్‌ తరుణ్‌ ‘టార్టాయిస్‌’

రాజ్‌ తరుణ్‌ ‘టార్టాయిస్‌’

· Entertainment · ntnews.com

రాజ్‌ తరుణ్‌ నటిస్తున్న తాజా చిత్రానికి ‘టార్టాయిస్‌’ అనే పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అమృత చౌదరి కథానాయిక. అవసరాల శ్రీనివాస్‌, ధన్య బాలకృష్ణ కీలక పాత్రధారులు. రిత్విక్‌ కుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ చౌదరి, శశిధర్‌ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. ఆదివారం టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని కూడా మేకర్స్‌ విడుదల చేశారు. డెడ్‌బాడీ పక్కనే రక్తపు మరకలతో కూర్చుని వున్న రాజ్‌తరుణ్‌ని ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో చూడొచ్చు. సస్పెన్స్‌, డ్రామా కలగలిసిన ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో దర్శకుడు రిత్విక్‌కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని, రాజ్‌కిరణ్‌ కెరీర్‌లో ఇప్పటిదాకా చేయని ఒక కొత్త తరహా పాత్రను ఇందులో చేస్తున్నారని, నిద్రలో నడిచే డిసీజ్‌ ఉన్న స్లీప్‌ వాకర్‌గా ఇందులో రాజ్‌తరుణ్‌ కనిపిస్తారని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శబరి విగ్నేష్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, నిర్మాణం: ఎస్‌కే గోల్డెన్‌ ఆర్ట్స్‌, ప్రశ్విత ఎంటర్‌టైన్మెంట్‌, ఎన్వీఎల్‌ క్రియేషన్స్‌

Original source: ntnews.com
Read more on Kaizer News