లయన్ వుండ్రు శ్యామ్ బాబు వైరా, ఆంధ్రప్రభ: ప్రకృతిని ప్రేమించి పర్యావరణాన్ని కాపాడాలని కంటి హాస్పటల్ నిర్వాహకులు లయన్ వుండ్రు శ్యాంబాబు అన్నారు. మేరీ ఇమిక్యులేట్ హైస్కూల్ ఆధ్వర్యంలో ‘పచ్చదనాన్ని కాపాడుతాం మొక్కలు నాటుదాం ‘ అని అవగాహనతో విద్యార్థులు స్కూలు ప్రధానోపాధ్యాయులు టీచర్ల ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. శ్యాంబాబు మాట్లాడుతూ.. స్వచ్ఛదనం పచ్చదనం ఎంతో ముఖ్యమని ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి మనిషి ఒక మొక్కను నాటాలని దానిని పరిరక్షించాలని కూడా ఆయన తెలిపారు. అనంతరం పర్యావరణ కాపాడదామని స్కూల్ విద్యార్థులుచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో మేరీ ఇమిక్యులేట్ స్కూల్ అధ్యాపకులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు