Kaizer News

Team India Selection Controversy: ఆ ప్లేయ‌ర్ కు టీ

Team India Selection Controversy: ఆ ప్లేయ‌ర్ కు టీమిండియా క్యాప్ ఇవ్వడంపై శ్రీకాంత్ ఫైర్, ఆ పేస‌ర్ ను బెంచ్‌పై కూర్చోబెట్టడం అన్యాయమంటూ విమ‌ర్శ‌లు

· National - India · telugu.abplive.com

టీమిండియా అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ గెలిచింది, యశ్ ఠాకూర్‌కు అవకాశం. యశ్ ఠాకూర్ ఎంపికపై శ్రీకాంత్ సెలెక్టర్లను తీవ్రంగా విమర్శించారు. ఠాకూర్‌కు సరైన ప్రతిభ, దేశవాళీ ప్రదర్శనలు లేవని శ్రీకాంత్ అన్నారు. భువనేశ్వర్ వంటి సీనియర్లకు అన్యాయం జరిగిందని మాజీ ఓపెనర్ ఆగ్రహం. Former Opener Slams Selectors Over Yash Thakur Cap Handover: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గురువారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా 127 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్తాన్‌ను మట్టికరిపించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ సేన 20 ఓవర్లలో 221/7 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 34 బంతుల్లోనే 11 సిక్సర్లు, 9 ఫోర్లతో 108 పరుగులు బాది నయా రికార్డు సృష్టించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్‌ను భారత బౌలర్లు 94 పరుగులకే కుప్పకూల్చారు. నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి వెన్నువిరిచారు. అయితే సిరీస్ గెలిచినప్పటికీ, ప్రధాన పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కే పరిమితం చేసి పేసర్ యశ్ ఠాకూర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవడంపై మాజీ డాషింగ్ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. Read Also: Rishabh Pant White Ball Snub: వ‌న్డేల‌ నుంచి పంత్‌ ఔట్.. ఇరానీ కప్ కి మాత్రం ప్రాముఖ్యత, సెలెక్టర్ల వ్యూహంపై ఆకాష్ చోప్రా క్లారిటీ ఎవరికి పడితే వారికి క్యాప్ ఇస్తారా.. శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు ఈ మ్యాచ్‌లో యశ్ ఠాకూర్ రెండు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ గణాంకాలు లేకపోయినా మేనేజ్‌మెంట్ అతడికి మద్దతు ఇవ్వడంపై శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. "రోడ్డున పోయే ప్రతి ఒక్కడికీ టీమ్ ఇండియా క్యాప్ ఇచ్చేస్తారా? యశ్ ఠాకూర్ లాంటి ఆటగాడికి భారత క్యాప్ లభిస్తుందంటే, ఎవరికి పడితే వాళ్లకు చాలా తేలిగ్గా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇస్తున్నారనే సంకేతం వెళ్తోంది. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదు. ఇండియా తరఫున ఆడాలంటే కొంత విశ్వసనీయత, బలమైన ప్రతిభ, దేశవాళీల్లో తిరుగులేని ప్రదర్శనలు ఉండాలి. యశ్ ఠాకూర్ ఇండియాకు ఆడటం సరైంది కాదు. భువనేశ్వర్ కుమార్ లాంటి నిరూపితమైన సీనియర్ల పట్ల ఇది తీవ్ర అన్యాయం. యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్ లాంటి ఆటగాళ్లకు తమ సొంత ఐపీఎల్ జట్లలోనే రెగ్యులర్‌గా ఆడే చోటు దక్కడం లేదు" అని శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. Read Also: Agarkar Exit Drama: రోహిత్ తో విభేదాలు, లక్ష్మణ్‌తో పగ.. అగార్కర్‌ను సాగనంప‌డానికి కార‌ణాలు ఇవేనా..? జింబాబ్వే టూర్‌లో అరంగేట్రం.. ఐపీఎల్‌లో ఒకే ఒక్క మ్యాచ్ జూలై నెలలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా యశ్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ పర్యటనలో రెండు మ్యాచ్‌లు ఆడిన అతడు రెండు వికెట్లు తీశాడు. ఐపీఎల్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 22 మ్యాచ్‌లు ఆడి 27 వికెట్లు సాధించాడు. అయితే ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అతడికి

Original source: telugu.abplive.com
Read more on Kaizer News