తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యా ప్రమాణాలను సరిగ్గా అంచనా వేసేందుకు విద్యాశాఖ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూళ్లలో జరిగే పరీక్షల జవాబు పత్రాలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులే దిద్దే పాత పద్ధతికి స్వస్తి పలకనున్నారు. మూల్యాంకన ప్రక్రియలో నిష్పక్షపాత వైఖరిని పెంపొందించడం, పారదర్శకతను పెంచడం , విద్యార్థుల నిజమైన ప్రతిభను గుర్తించడమే లక్ష్యంగా ‘క్రాస్ వాల్యుయేషన్’ విధానాన్ని అధికారికంగా అమలు చేయనున్నారు. వేరే ఉపాధ్యాయులతో మూల్యాంకనం – పక్షపాతానికి చెక్ కొత్తగా రూపుదిద్దుకున్న […]