Kaizer News

Penamaluru: పెనమలూరులో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థా

Penamaluru: పెనమలూరులో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం!

· State - Telangana · hmtvlive.com

Shorts Penamaluru: పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులు విస్తృత స్థాయిలో సమావేశమయ్యాయి. నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ ఇంచార్జ్ శ్రీ దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో చిన్న ఓగిరాలలోని అక్కినేని కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం ఈ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయడం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు, రీజినల్ కో-ఆర్డినేటర్ శ్రీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని), గుడివాడ ఇంచార్జ్ శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు (నాని), అవనిగడ్డ ఇంచార్జ్ శ్రీ సింహాద్రి రమేష్ బాబు, గన్నవరం ఇంచార్జ్ శ్రీ వల్లభనేని వంశీ, పెడన నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ ఉప్పాల రాము, మచిలీపట్నం ఇంచార్జ్ శ్రీ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని, గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత చురుకుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో ముందుకు సాగేందుకు ఈ సమావేశం వేదికగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరు కావడంతో సమావేశ ప్రాంగణంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News