Kaizer News

Gajwel: భారత్ నగర్‌లో వైభవంగా 108 లీటర్ల పాలతో గణప

Gajwel: భారత్ నగర్‌లో వైభవంగా 108 లీటర్ల పాలతో గణపతి అభిషేకం

· State - Telangana · hmtvlive.com

Shorts సిద్దిపేట జిల్లా: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 14వ వార్డు భారత్ నగర్‌లో సిరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గణనాథుడికి 108 లీటర్ల స్వచ్ఛమైన ఆవుపాలతో విశేష అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అలంకరణలు చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు. కార్యక్రమానికి ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న సిరి యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుంటుకు శిరీష రాజు ముదిరాజ్, అయ్యప్ప ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్, బుక్క రమేష్, జిల్లా కళ్యాణ్ మాధవి దంపతులు, సహస్ర, నిఖిల, అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News