Kaizer News

Kothagudem: డిసెంబర్‌లో TSUTF 7వ రాష్ట్ర మహాసభలు..

Kothagudem: డిసెంబర్‌లో TSUTF 7వ రాష్ట్ర మహాసభలు.. ఆహ్వాన సంఘం ఏర్పాటు

· State - Telangana · hmtvlive.com

Shorts కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) ఏడవ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. మహాసభలను విజయవంతం చేసేందుకు ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని ఆదివారం కొత్తగూడెంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బి. మురళీమోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో TSUTF రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, బలోపేతం కోసం TSUTF నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతో మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభల నిర్వహణ కోసం ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. గౌరవాధ్యక్షుడిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అధ్యక్షుడిగా కోనేరు పూర్ణచంద్రరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బి. రాజు, ప్రధాన కార్యదర్శిగా ఎం. వెంకటేశ్వర్లు, కోశాధికారిగా బి. మురళీమోహన్లను ఎన్నుకున్నారు. చీఫ్ ప్యాట్రన్‌గా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలితకుమారి, వ్యవసాయ కార్మిక సంఘం బాధ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ నాయకుడు ఎస్.కె. సాబీర్ పాషా తదితరులను ప్యాట్రన్లుగా నియమించారు. సహాధ్యక్షులుగా దుర్గ భవాని, సమ్మారావు, మల్లారెడ్డి, పి. నాగేశ్వరరావు, బి. నరసింహారావు, బి. రాందాస్, బి. కిషోర్ సింగ్, ఏ. వెంకటేశ్వర్లు, వి. వరలక్ష్మి, ఎం. రాజయ్య, ఎస్. వెంకటేశ్వర్లు, జిరాయ శేఖర్, ఎం. వీరబాబు, జి.వి. మల్లేశ్వరరావు, కళ్యాణం నాగేశ్వరరావు తదితరులను నియమించారు. గౌరవ సలహాదారులుగా ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులను తీసుకోగా, జిల్లా ఆఫీస్ బేరర్లు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సబ్‌కమిటీల కన్వీనర్లు, కార్యదర్శులు ఆహ్వాన సంఘంలో భాగస్వాములుగా ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో TSUTF రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్. దుర్గ భవాని, ఎం. రాజశేఖర్‌రెడ్డి, టి. లక్ష్మారెడ్డి, కార్యదర్శులు రంజిత్‌కుమార్, శ్రీధర్, సింహాచలం, వెంకటప్ప, రవికుమార్, సమ్మారావు, నాగేశ్వరరావు, వెంకటేశం, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. మురళీమోహన్, ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు, సీనియర్ నాయకులు ఎస్.కె. దస్తగిరి తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News