Kaizer News

Jangaon: పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే ఊ

Jangaon: పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే ఊరుకోం: బీఆర్‌ఎస్!

· State - Telangana · hmtvlive.com

Shorts జనగామ: జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిపై ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలని మార్కెట్ మాజీ చైర్మన్ సిద్ది లింగం అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ సందర్బంగా సిద్ది లింగం మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంచి పేరున్న నాయకుడని, నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు. రైతులు, యువకులు తమ సమస్యలపై నిరసనలు తెలిపేందుకు వెళ్తే వారిని పోలీస్ స్టేషన్లలో పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి పనులు చేయించాలనే చిత్తశుద్ధి ఉంటే సంబం ధిత మంత్రులతో మాట్లాడి పనులు చేయించుకోవాలని సూచించారు. సీతక్క జనగామకు వచ్చి రూ.17 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెబుతున్నారని, అసలు ఎక్కడ, ఏఏ పనులకు ఎంత నిధులు ఖర్చు చేశారో పూర్తి నివేదికను ప్రజల ముందు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జనగామలో రోడ్ల విస్తరణ, మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, బతుకమ్మ కుంట తదితర అనేక అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిపై ఆరోపణల్లో నిజం ఉంటే ధైర్యంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. జనగామ నియోజకవర్గంలో పల్లా రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదని, విద్యా, వైద్య రంగాల్లో సేవలు అందిస్తూ ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు. అనవసర విమర్శలు మానుకుని ప్రజాసేవపై దృష్టి పెట్టాలి, బీఆర్‌ఎస్ హయాంలో జనగామలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, జనగామ మున్సిపాలిటీకి ఐదేళ్లలో మూడు ప్రభుత్వ అవార్డులు, రూ.17 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులపై నివేదిక విడుదల చేయాలి. కాంగ్రెస్ నాయకులు అనవసర విమర్శలు చేయకుండా ప్రజాసేవలో ముందుండి ప్రజలకు న్యాయం చేయాలని మున్సిపల్ మాజీ చైర్‌ పర్సన్ పోకల జామున సూచించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని, ప్రజలకు ఉపయో గపడే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జనగామలో అనేక అభివృద్ధి కార్యక్ర మాలు జరిగాయని తెలిపారు. ప్రధాన రహదారుల విస్తరణ, డివైడర్ల ఏర్పాటు, స్ట్రీట్ లైట్లు, చెట్ల పెంపకం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధా మాలు వంటి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జనగామకు మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ తీసుకురావడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. జనగామ మున్సిపాలిటీకి గత ఐదేళ్లలో ఒక కేంద్ర ప్రభుత్వ అవార్డు, రెండు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు లభించాయని ఆమె గుర్తు చేసారు. ఈ అవార్డులు పాలకవర్గం, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజల సహకారంతో సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకుండా సక్రమంగా నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి తీసుకొచ్చిన CT

Original source: hmtvlive.com
Read more on Kaizer News