పం డుగైనా.. ప్రత్యేకమైన రోజైనా.. ఇంట్లోకి వచ్చే అతిథులకు వెరైటీ వంటకాలు వడ్డించాలంటే ఈ రెసిపీలు మీకు బాగా ఉపయోగపడతాయి. రుచితో పాటు చూడటానికి కూడా ఆకట్టుకునేలా ఉండే ఈ మూడు వంటకాలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. నవరతన్ కుర్మా, క్రిస్పీ పొటాటో క్యూబ్స్, కాజూ కలశ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నవరతన్ కుర్మా కావలసినవి.. తొమ్మిది రకాల కూరగాయల ముక్కలు (క్యారెట్, బీన్స్, బఠాణీ, ఆలుగడ్డ, కాలీఫ్లవర్, పనీర్, జీడిపప్పు, బాదం, కిస్‌మిస్): 2 కప్పులు, ఉల్లిపాయలు: 2 (తరిగినవి), టొమాటోలు: 2 (తరిగినవి), అల్లం వెల్లుల్లి పేస్ట్: టీస్పూన్, గసగసాలు– జీడిపప్పు పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్: 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా: 1/2 టీస్పూన్, కసూరీ మేథీ: 1/2 టీస్పూన్, కారం, పసుపు: రుచికి తగినంత, నెయ్యి లేదా నూనె: 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత. ముందుగా క్యారట్, బీన్స్, బఠాణీ, ఆలుగడ్డ, కాలీఫ్లవర్ ముక్కలను కొద్దిగా ఉప్పు వేసి 50 శాతం వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పనీర్ ముక్కలు, జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌లను నెయ్యిలో దోరగా వేయించాలి. తరువాత మసాలా పేస్ట్ తయారీ కోసం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, టొమాటోలను మెత్తగా రుబ్బుకోవాలి. విడిగా నానబెట్టిన గసగసాలు, జీడిపప్పును కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి ఉల్లిపాయ–టొమాటో పేస్ట్ వేసి నూనె తేలే వరకు వేయించాలి. అందులో పసుపు, కారం, ఉప్పు, గసగసాలు–జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి. ఇందులోనే ఉడికించిన కూరగాయలు, వేయించిన పనీర్, జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు లేదా పాలు పోసి మూతపెట్టి 5–7 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి. చివరగా గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్, కసూరీ మేథీ చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ నవరతన్ కుర్మా నాన్ లేదా జీరా రైస్‌లోకి చాలా రుచిగా ఉంటుంది. క్రిస్పీ పొటాటో క్యూబ్స్ కావలసినవి.. బంగాళాదుంపలు: 3 పెద్దవి (చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి), వంట సోడా: 1/2 టీస్పూన్, నూనె: 3 టేబుల్ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్: 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి పొడి: 1 టీస్పూన్, కారం: 1 టీస్పూన్, మిరియాల పొడి: 1/2 టీస్పూన్, ఉప్పు: తగినంత. ఒక పాత్రలో నీళ్లు తీసుకుని ఉప్పు, బేకింగ్ సోడా వేసి మరిగించాలి. అందులో బంగాళ దుంపల ముక్కలు వేసి, ఐదు నిమిషాలు సగం ఉడికేలా మరిగించి నీటిని వడకట్టాలి. ఆ తరువాత నీళ్లు తీసేసిన పొటాటో ముక్కలను అదే పాత్రలో ఉంచి, బాగా కుదపాలి. ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని నూనె, కార్న్‌ఫ్లోర్, వెల్లుల్లి పొడి, కారం, మిరియాల పొడి, ఉప్పు వేసి ముక్కలన్నింటికీ పట్టేలా బాగా కలపాలి. పాన్ లో నూనె వేసి వేడయ్యాక, ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్ మీద 12–15 నిమిషాల పాటు తిప్పుతూ బంగారం రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే వేడి వేడి క్రిస్పీ పొటాటో క్యూబ్స్ రెడీ. వీటిని వేడిగా ఉన్నప్పుడే సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి. కాజూ కలశ్ కావలసినవి.. జీడిపప్పు: కప్పు, పంచదార: 1/2 కప్పు, నీళ్లు: 1/4 కప్పు, ఏలకుల పొడి: 1/4 టీస్పూన్, నెయ్యి: టీస్పూన్, స్టఫింగ్ కోసం (సన్నగా తరిగిన బాదం, పి