అధ్యక్షుడిగా దేశరాజుల మహేష్ ఆచారి.. ప్రధాన కార్యదర్శిగా శ్రీపాద కృష్ణ కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలోని సీతారాముల ఆలయం వద్ద ఆదివారం మండల విశ్వబ్రాహ్మణులు సమావేశమై సంఘం నూతన మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా గొల్లపెల్లి వేణుగోపాలచారి, అధ్యక్షుడిగా దేశరాజుల మహేష్ ఆచారి, ఉపాధ్యక్షుడిగా వంగల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా శ్రీపాద కృష్ణ, కోశాధికారిగా ఎనగుర్తి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా నర్సింగ్ రాకేష్‌లను ఎన్నుకున్నారు. సలహాదారులుగా ముమ్మడి సత్యం చారి, పడకంటి మహేందర్‌ను ఎంపిక చేశారు. మండల కార్యవర్గ సభ్యులుగా కూచనపల్లి నర్సయ్య, నర్సింగ్ రమేష్, వంగల మురళి, కూచనపల్లి శ్రీనివాస్, వంగల హరికృష్ణ, బొంపెల్లి నవీన్, శ్రీగద్దె ప్రకాష్, కూచనపల్లి నర్సింహాచారి, సంకోజీ తిరుపతి, సంకోజీ నర్సయ్య, తొగిటి రాజమౌళి, అంగుల్ నారాయణ, ఉల్లి లక్ష్మీరాజం, గొల్లపల్లి కరుణాకర్, అంగుల్ పరమేశ్వర్‌లను ఎన్నుకున్నారు