Kaizer News

బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శినగేష్ స

బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శినగేష్ సస్పెండ్

· State - Telangana · prabhanews.com

తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి మండలం బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు బీరెల్లి గ్రామ కమిటీ నాయకుడు దయ రోశయ్య తెలిపారు. బీరెల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి జాజా విజయ, 1వ వార్డు సభ్యురాలు మెస్సు రమకు వ్యతిరేకంగా నాగేష్‌ పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. పార్టీ అభ్యర్థుల ఓటమికి పనిచేస్తూ, 1వ వార్డు సభ్యురాలి అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ విషయంపై పార్టీలో నిర్వహించిన అంతర్గత విచారణలో ఆరోపణలు నిర్ధారణ అయినట్లు దయ రోశయ్య తెలిపారు. నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు పోగు నాగేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News