Kaizer News

మోదీ కేబినెట్ లోకి తెలంగాణ నుంచి ఆ ఇద్దరు, కీలక మం

మోదీ కేబినెట్ లోకి తెలంగాణ నుంచి ఆ ఇద్దరు, కీలక మంత్రాంగం..!!

· State - Telangana · telugu.oneindia.com

ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ పై కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన దిశ గా కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరి పైన వేటు వేస్తూ.. యువత, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. వినాయక చవితికి ముందే ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది. కాగా.. తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలకు సంకేతాలు అందుతున్నాయి. కేంద్ర కేబినెట్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కీలక మైన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ నుంచి మంత్రివర్గంలో అవకాశం ఎక్కువగా ఛాన్స్ కనిపిస్తోంది. అదే విధంగా టీఎంసీ, ఆప్, ఎన్సీపీ నుంచి కొత్త మంత్రులుగా అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుత మంత్రుల పోర్టు పోలియోలు మారనున్నాయి. కాగా, బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు అవకాశం దక్కలేదు. ఇక, ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. దక్షిణాదిలో తెలంగాణ పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో కిషన్ రెడ్డి పార్టీ పార్లమెంటరీ బోర్డు లో అవకాశం ఇవ్వనున్నారు. కొత్తగా ఇద్దరు మంత్రుల ఎంపిక పైన తుది కసరత్తు జరుగుతోంది. కొండా సురేఖ పై మారిన కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన - ఇలా చేద్దాం..!? తెలంగాణ పై బీజేపీ ప్రత్యేక ఫోకస్ రాష్ట్రంలో 2028 లో జరిగే ఎన్నికల కోసం పార్టీ కార్యచరణ ఖరారు చేస్తోంది. అందులో భాగంగా డీకే అరుణ, అదిలాబాద్ ఎంపీ నగేష్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ మంత్రివర్గం రేసులో ఉన్నారు. వీరిలో మహిళా నేతగా డీకే అరుణకు ఖాయమని తెలుస్తోంది. అదే విధంగా అదిలాబాద్ ఎంపీ నగేశ్ పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. బీసీ వర్గాలకు మరో మంత్రి పదవి ఇవ్వటం పైనా ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో.. ఈ నలుగురిలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కటం ఖాయమని సమాచారం. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తరువాత కేబినెట్ తుది కూర్పు పైన నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబర్ 7-9 మధ్య కేంద్ర కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని ఢిల్లీ వర్గాల సమాచారం. దీంతో.. చివరి నిమిషంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ పార్టీ నేతల్లో కనిపిస్తోంది

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News