మీర్‌పేట: చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ హెచ్చరించారు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధి లెనిన్‌నగర్‌లో శనివారం సుమారు 250 మంది పోలీసు సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, రెండు గృహ వినియోగ సిలిండర్లు, రూ.4వేల విలువైన గుట్కా ప్యాకెట్లు, 2.7 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. నలుగురు రౌడీషీటర్లు, ముగ్గురు అనుమానితులను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. అసాంఘీక కార్యక్రమాలు, నేరాలు నివారించడమే కార్డన్ సెర్చ్ ఉద్దేశమని తెలిపారు. తనిఖీల్లో మీర్‌పేట, బాలాపూర్ ఇన్‌స్పెక్టర్లు శోభన్, సుధాకర్, డీఐ మట్టం రాజు, రమణ, అబ్ధుల్ అయ్యుం, నితిన్‌రెడ్డి, ఉమామహేశ్వరి, హరీష్, మల్లయ్య పాల్గొన్నారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం