Indian Hockey Team: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పురుషుల హాకీ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు గర్జించింది. ఈ రోజు (సెప్టెంబర్ 20, ఆదివారం) జరిగిన పూల్-ఎ తొలి మ్యాచ్‌లో ఇండోనేషియాను 13–1 తేడాతో ఘోరంగా ఓడించి టైటిల్ డిఫెన్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. మ్యాచ్ మొదటి నిమిషం నుంచి చివరి వరకు టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించగా, ఏకంగా 8 మంది ఆటగాళ్లు గోల్స్ సాధించడం విశేషం. భారత స్టార్ ఫార్వర్డ్ దిల్‌ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్‌లో మైండ్ బ్లాకింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఇక దిల్‌ప్రీత్ సింగ్ మ్యాచ్‌లో అత్యధికంగా 4 గోల్స్ (18వ, 19వ, 37వ, 49వ నిమిషాల్లో) కొట్టి ఇండోనేషియా డిఫెన్స్‌ను చిత్తు చేశాడు. దిల్‌ప్రీత్‌తో పాటు షీలానంద్ లక్రా (2), సుఖ్‌జీత్ సింగ్ (2), అభిషేక్, రాజిందర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్‌రాజ్ సింగ్‌లు తలో గోల్ సాధించి విక్టరీలో భాగమయ్యారు. * మ్యాచ్ ప్రారంభమైన 6వ నిమిషం లోనే షీలానంద్ లక్రా గోల్‌తో భారత్ ఖాతా తెరిచాడు. 12వ నిమిషంలో అభిషేక్ గోల్‌తో తొలి క్వార్టర్ ముగిసేసరికి భారత్ 2–0 ఆధిక్యంలో నిలిచింది. * సెకండ్ క్వార్టర్‌లో తుఫాన్: రెండో క్వార్టర్‌లో భారత్ వీరవిహారం చేసింది. దిల్‌ప్రీత్ వరుసగా రెండు నిమిషాల్లో (18, 19) రెండు గోల్స్ కొట్టగా, రాజిందర్, మన్‌దీప్, హర్మన్‌ప్రీత్‌లు మిగిలిన గోల్స్ కొట్టారు. దీంతో హాఫ్ టైమ్ సమయానికి భారత్ 7–0 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. * మూడో క్వార్టర్ 33వ నిమిషం లో ఇండోనేషియా కెప్టెన్ ఆలియా అల్ అర్ద్ పెనాల్టీ కార్నర్ ద్వారా ఆ జట్టుకు ఏకైక గోల్ అందించాడు. కానీ ఆ వెంటనే భారత్ మళ్లీ పుంజుకుని వరుస గోల్స్‌తో విరుచుకుపడి స్కోరును 12–1కి చేర్చింది. . బంగ్లాను తొక్కిపడేసి ఫైనల్లోకి భారత్ ఇండోనేషియాపై భారీ విజయంతో టోర్నీలో బోణీ కొట్టిన భారత పురుషుల హాకీ జట్టు, సెప్టెంబర్ 22వ తేదీన జరగనున్న తమ తదుపరి పూల్-ఎ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది