అనగనగా రష్యాలోని దట్టమైన మంచు అడవిలో ఒక చలికోడి (రష్యన్ గ్రౌస్) ఉండేది. ఒక సాయంత్రం ఆ కోడి ఒక చెట్టు కొమ్మపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటోంది. అదే సమయంలో ఆహారం కోసం వెతుకుతున్న జిత్తులమారి నక్క ఆ చెట్టు కిందికి వచ్చింది. పైన కూర్చున్న కోడిని చూడగానే నక్క నోట్లో నీరూరాయి. కానీ అంత ఎత్తుకు తను ఎగరలేదు కదా. అందుకే ఒక ఉపాయం ఆలోచించింది. నక్క మంచితనంగా ‘ఓ కోడి మరదలా! నీకో శుభవార్త. మన అడవి జంతువులన్నీ కలిసి ఇప్పుడే ఒక కొత్త చట్టం చేసుకున్నాయి. దాని ప్రకారం అడవిలో ఎవరూ ఒకదానినొకటి చంపుకోకూడదు, అందరూ స్నేహంగా ఉండాలి. కాబట్టి నువ్వు భయం లేకుండా కిందికి రా, ఇద్దరం ఆలింగనం చేసుకుని స్నేహం చేద్దాం’ అంది. కోడి నక్క మోసాన్ని గ్రహించి, ‘అవునా బావా! ఎంత మంచి వార్త చెప్పావు. అదో చూడు, దూరంగా వేటగాళ్లు తమ వేట కుక్కలతో ఇటువైపే వస్తున్నారు. ఆ కుక్కలు కూడా ఈ కొత్త చట్టం వింటే ఎంతో సంతోషిస్తాయి కదా’ అంది. ‘వేట కుక్కలు’ మాట వినగానే నక్క గుండె ఆగిపోయినంత పనైంది. తోక ముడుచుకుని పారిపోవడానికి సిద్ధమైంది. అప్పుడు కోడి నవ్వుతూ ‘ఎందుకు పారిపోతున్నావు నక్క బావా? కొత్త చట్టం వచ్చింది కదా, కుక్కలు నిన్నేం చేయవులే’ అంది. దానికి నక్క వణుకుతూ ‘బహుశా ఆ కుక్కలకు ఇంకా కొత్త చట్టం తెలిసి ఉండదు’ అని అడవిలోకి పరుగు తీసింది. కోడి తన తెలివితో ప్రాణాలు కాపాడుకుంది. నీతి: ఆపద సమయంలో ఆవేశపడకుండా ఉపాయంతో ఆలోచిస్తే ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు. భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే