Vijay Sai Reddy: తాను జగన్‌కు ఎప్పుడూ నమ్మకద్రోహం చేయలేదని.. నమ్మకద్రోహమే తన రక్తంలో ఉంటే ఎప్పుడో పార్టీ మారిపోయేవాడిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ కోటరీ తనను నమ్మకద్రోహి అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తోందంటూ మాజీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు బహిరంగ లేఖ విడుదల చేశారు. జగన్ కి నమ్మకస్తుడిననే కారణంతోనే అనేక కేసుల్లో తనను నిందితుడిగా చేర్చారని చెప్పుకొచ్చారు. 2020 తర్వాత తనపై పార్టీలో క్రమంగా కుట్రలు, అవమానాలు పెరిగాయని.. తనను ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు కోర్ కమిటీ నుంచి కూడా తొలగించారని గుర్తు చేసుకున్నారు. తాను ఎప్పుడూ కోటరీలో లేనని.. జగన్ దృష్టిలో తన మాటకు ఉన్న విలువను 2020 నుంచి అంచెలంచెలుగా తగ్గించింది ఎవరు? అంటూ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని ఆరోపించారు