ఫోన్ పే, గూగుల్ పేతోనే 80 శాతం యూపీఐ లావాదేవీలు రూ. 16,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా లాభపడనున్న వాల్‌మార్ట్, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వీసా, మాస్టర్‌కార్డ్‌కు పరోక్షంగా ప్రయోజనం న్యూఢిల్లీ : రూ.2,000 పైబడిన యూపీఐ లావాదేవీలపై 0.4% మర్చంట్ ఫీజు వసూలు చేయాలన్న మోదీ సర్కార్ ప్రణాళిక ఎక్కువగా అమెరికా కంపెనీలకే లబ్ధి చేకూర్చనున్నది. వాణిజ్య నిపుణుల ప్రకారం.. ఈ ఫీజు అమెరికా కంపెనీ వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్ పేకు కొత్త ఆదాయ వనరును సృష్టించడంతోపాటు త్వరలో చేపట్టనున్న ఐపీవోకు ముందు దాని విలువను పెంచే అవకాశం ఉన్నది. భారత్ ఉచిత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, రూపే నెట్‌వర్క్ తమకు ప్రతికూలంగా మారాయని అమెరికా కంపెనీలు చాలాకాలంగా వ్యక్తం చేస్తున్న ఆందోళనలను కూడా ఈ చర్య కొంతవరకు తగ్గించవచ్చు. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్‌ఐ) పేర్కొన్న అంచనాల ప్రకారం.. యూపీఐ లావాదేవీల్లో 80 శాతానికి పైగా ఫోన్ పే, గూగుల్ పే కలిపి నిర్వహిస్తున్నాయి. అందువల్ల ఈ మార్పు ముఖ్యంగా ఈ రెండు సంస్థలకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్నది. అయితే దీని ప్రభావం యూపీఐ ఆపరేటర్లకే పరిమితం కాదు. అంతర్జాతీయ కార్డ్ నెట్‌వర్క్‌లైన వీసా, మాస్టర్‌కార్డ్ పోటీ స్థితిని కూడా ఈ మార్పు మెరుగుపరచవచ్చని జీటీఆర్‌ఐ వాదిస్తున్నది. యూపీఐతో పోలిస్తే కార్డ్ చెల్లింపులపై ఉండే వ్యయ వ్యత్యాసం తగ్గడమే దీనికి కారణమని చెప్తున్నది. క్రెడిట్ కార్డుకు ఎండీఆర్ 1.5% నుంచి 2.5% వరకు, డెబిట్‌కార్డుకు 0.9% వరకు ఉన్నది. కొత్త యూపీఐ రేటు 0.4% క్రెడిట్, డెబిట్ కార్డుల ఎండీఆర్ కంటే తక్కువగా ఉన్నది. భారత్‌లో సున్నా ఖర్చుతో కూడిన యూపీఐ వ్యవస్థ, చెల్లింపుల మార్కెట్‌లో రూపే స్థానం కలిసి వీసా, మాస్టర్‌కార్డ్ వంటి అంతర్జాతీయ నెట్‌వర్క్‌లను ఇప్పటివరకు ప్రతికూల స్థితితో ఉంచాయని థింక్‌ట్యాంక్ చెప్తున్నది. అయితే యూపీఐపై చార్జీలు విధించడం కార్డ్ నెట్‌వర్క్‌ల పోటీ సమీకరణాన్ని మారుస్తుందని జీటీఆర్‌ఐ తెలిపింది. ఈ నిర్ణయంపై అమెరికా ఒత్తిడి ప్రభావం చూపిందన్న వాదనలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిరస్కరించారు. కొత్త విధానం స్థిరమైన చెల్లింపుల వ్యవస్థను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే భారతదేశపు పబ్లిక్ డిజిటల్ పేమెంట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగిస్తున్న విదేశీ యాజమాన్యంలోని టెక్నాలజీ కంపెనీలకు అదనపు ఆదాయాన్ని సృష్టించడానికి భారతీయ వ్యాపారులు, వినియోగదారులు సహాయపడాలా అని జీటీఆర్‌ఐ ప్రశ్నించింది. యూపీఐని భారతీయ ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు అభివృద్ధి చేశాయని, అయితే జీటీఆర్‌ఐ పేర్కొన్న అంచనాల ప్రకారం ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే కలిపి 80 శాతానికి పైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్నాయని థింక్ ట్యాంక్ పేర్కొన్నది. ప్రభుత్వ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తున్న విదేశీ ప్లాట్‌ఫామ్‌లపై భాగస్వామ్య రుసుం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని జీటీఆర్‌ఐ వాదిస్తున్నది. భవిష్యత్తులో ఇతర యూపీఐ లేదా రూపే లావాదేవీలకు కూడా ఫీజులను విస్తరించే అవకాశం ఉన్నదని చెప్తున్నది. జీటీఆర్‌ఐ, భారతీయ ఫిన్‌టెక