బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుపై రాష్ట్ర హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్టు నిర్ధారించింది. ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, అదే పార్టీలో కొనసాగుతూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ద్వారా బీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని ధర్మాసనం తేల్చి చెప్పింది