పుత్తూరు : మండలంలోని చెర్లోపల్లె వద్ద కల్వీర్ ఎక్స్‌పోర్ట్స్ గ్రానైట్ క్వారీలో శనివారం ఉద యం చేపట్టిన బ్లాస్టింగ్ కారణంగా తాను గాయపడినట్లు ఈశ్వరయ్యయాదవ్ అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. గ్రామానికి చెందిన ఈశ్వరయ్యయాదవ్ తన పొలంలో ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా సమీపంలోని క్వారీలో పేలుడు జరిగింది. ఆ తాకిడికి ఈశ్వరయ్యయాదవ్‌పై ఒక రాయి వచ్చి పడింది. గాయపడి ఈశ్వరయ్యయాదవ్‌ను ఆస్పత్రికి తరలించారు. క్వారీలో బ్లాస్టింగ్ ల కారణంగా తన పొలం ఎందుకు పనికి రాకుండా పోయిందని బాధితుడు ఆరోపించారు. క్వారీ యాజమాన్యంపై తగిన చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన ఆరిపోయిన వెలుగు కథనంపై జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి స్పందించారు. 2026–27 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు 26,577 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. అందులో 2,379 మందిని ఉచిత కంటి అద్దాలకు అర్హులుగా గుర్తించామని తెలిపారు. వీరి కళ్లజోళ్ల పంపిణీకి కలెక్టర్‌కు ఫైలు సమ ర్పించగా, టెండర్ ద్వారా కొనుగోలు చేయడానికి అనుమతి లభించిందని చెప్పారు. ఆ ఫైలు ప్రస్తుతం చివరిదశలో ఉందని వివరించారు. పూర్తిస్థాయి అనుమతి లభించిన వెంటనే విద్యార్థులకు విడతల వారీగా ఉచిత కళ్లజోళ్లు పంపిణీ చేస్తామని, ఈ కార్యక్రమం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం