Kaizer News

అంతొద్దు సీఎం విజయ్.. ఆశకు హద్దు ఉండాలి: డీఎంకే, క

అంతొద్దు సీఎం విజయ్.. ఆశకు హద్దు ఉండాలి: డీఎంకే, కాంగ్రెస్ ఎగతాళి

· State - Telangana · v6velugu.com

ఆశకు హద్దు ఉండాలి.. తన పరిధి ఏంటో తెలుసుకోవాలి.. దేనికైనా లిమిట్ ఉంటుంది అంటూ తమిళనాడు సీఎం విజయ్కు గడ్డి పెడుతున్నాయి పార్టీలు. పీఎం ఫర్ విజయ్.. ప్రధాని విజయ్ అంటూ టీవీకే పార్టీ నుంచి నడుస్తున్న క్యాంపెయిన్పై మిత్రపక్షం కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షం డీఎంకే పార్టీలు చురకలు వేస్తున్నాయి. సీఎం విజయ్ తన పరిధి ఏంటో తెలుసుకోవాలని.. ఆశకు హద్దుండాలని.. అంతొద్దమ్మ అంటూ ఎగతాళి చేస్తున్నాయి. ఇండియా టుడే-సీవోటర్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రధానమంత్రి పదవికి అగ్రశ్రేణి ఎంపికలలో ఒకరిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సర్వే రిజల్ట్ తర్వాత.. 'విజయ్ ఫర్ పీఎం' నినాదాన్ని టీఎంకే పార్టీ పనిగట్టుకుని మరీ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేసింది. ఈ ప్రచారంపై తమిళనాడు ప్రతిపక్ష పార్టీలు టీవీకే పార్టీని, విజయ్ను ఎద్దేవా చేశాయి. ప్రతిపక్ష డీఎంకే నుంచే కాదు.. టీవీకే మిత్రపక్షమైన కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీఎంకే నాయకుడు ఆర్.ఎస్. భారతి ఈ ప్రచారంపై స్పందిస్తూ.. టీఎంకే పార్టీ నేతల ఊహలకు హద్దులు లేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అయితే ఒకడుగు ముందుకేసి.. 2029లో రాహుల్ గాంధీకి టీఎంకే మద్దతు ఇవ్వకపోతే విజయ్ మంత్రివర్గం నుంచి వైదొలుగుతామని కాంగ్రెస్ హెచ్చరించింది

Original source: v6velugu.com
Read more on Kaizer News