జర్నలిస్ట్ కాలనీలో ఆధ్యాత్మిక శోభ.. అలరించిన సై డాన్స్ అకాడమీ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు మహబూబ్‌నగర్, ఆంధ్రప్రభ : పాలమూరు జర్నలిస్ట్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు శనివారం గణనాథుని సన్నిధి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఉత్సవాల్లో భాగంగా సై డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు కాలనీవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విద్యార్థులు సంప్రదాయ, సాంస్కృతిక నృత్యాలతో సందడి చేశారు. చిన్నారుల అద్భుతమైన హావభావాలు, లయబద్ధమైన నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. గణనాథుని భక్తిగీతాలకు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలతో ఉత్సవ ప్రాంగణం కరతాళధ్వనులతో మార్మోగింది.కాలనీవాసులు, చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్య ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహిస్తూ కాలనీలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది