హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మను, చేనేత కార్మికులను ఆదుకోవాలనే సామాజిక బాధ్యత జోడించి లండన్‌లో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK) నిర్వహించబోతున్న “టాక్ చేనేత బతుకమ్మ – దసరా 2026 ” సంబురాల పోస్టర్‌ను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆవిష్కరించారు. జెడ్పి మాజీ చైర్మన్ తుల ఉమ, ఇతర బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ మహిళా నాయకులు, లండన్ ఎన్నారైలు, స్థానిక నాయకులతో కలిసి ఆయన ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ…బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఇది ఒక విశిష్టమైన ప్రతిరూపమని అన్నారు. “టాక్ చేనేత బతుకమ్మ – దసరా 2026 ” సంబురాల పోస్టర్ ఆవిష్కరణ అనంతరం దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, పండుగలు, కళలు, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడంలో ప్రవాస తెలంగాణ ప్రజలు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా టాక్ సంస్థ చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ, సామాజిక బాధ్యతతో బతుకమ్మ పండుగను “టాక్ – చేనేత బతుకమ్మ”గా నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమని దేశపతి శ్రీనివాస్ అన్నారు. చేనేత అనేది ఒక వృత్తి మాత్రమే కాదని, తెలంగాణ కళాకారుల తరతరాల నైపుణ్యానికి, శ్రమకు, మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను చేనేతతో అనుసంధానం చేస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా చేనేత కళాకారులకు ప్రోత్సాహం లభించడంతో పాటు, తెలంగాణ చేనేత ప్రత్యేకతను, మన సంస్కృతి గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికపై మరింత విస్తృతంగా చాటిచెప్పే అవకాశం ఏర్పడుతుందని ఎమ్మెల్సీ అన్నారు. ప్రవాస తెలంగాణ సమాజం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా తెలంగాణ సంస్కృతి, భాష, కళలు, సంప్రదాయాలను భావితరాలకు చేరవేస్తూ వాటి పరిరక్షణకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని దేశపతి శ్రీనివాస్ తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ, మన సంస్కృతి పట్ల గర్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పడం అభినందించదగ్గ విషయమని ఆయన అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పండుగలకు ప్రత్యేక గౌరవం లభించిందని వారు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం బతుకమ్మ, బోనాలు వంటి తెలంగాణ పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిస్తూ, వాటి వైభవాన్ని మరింతగా చాటిచెప్పేలా చర్యలు చేపట్టిందని దేశపతి పేర్కొన్నారు. బతుకమ్మ పండుగకు అధికారిక రాష్ట్ర పండుగ హోదా కల్పించడంతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు మరింత గౌరవం, గుర్తింపు లభించిందని వారు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుండి అనిల్ కూర్మాచలం, వారి బృందం లండన్ వేదికగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో నిరంతరం చేస్తున్న కృషిని దేశపతి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ సంస్కృతి పరిరక్షణ, చేనేత కార్మికుల ప్రోత్సాహం, బతుకమ్మ పండుగను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడంలో టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, టాక్ సంస్థకు, అనిల్ కూర్మాచలం, వారి బృందానికి ఆయన హృదయ