Kaizer News

మహాలింగేశ్వర ఆలయంలో భక్తుల సందడి..

మహాలింగేశ్వర ఆలయంలో భక్తుల సందడి..

· State - Telangana · prabhanews.com

దండేపల్లి, ఆంధ్రప్రభ: దండేపల్లి మండలం గూడెం గోదావరి తీరాన వెలసిన శ్రీ మహాలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. శ్రావణ మాసం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులు మహాలింగేశ్వరస్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. శ్రావణ సోమవారం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూజలు, దర్శనం ప్రశాంతంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టారు

Original source: prabhanews.com
Read more on Kaizer News