Kaizer News

Eluru: ఏలూరు కార్పొరేషన్‌లో రూ.కోటి పన్నుల సొమ్ము

Eluru: ఏలూరు కార్పొరేషన్‌లో రూ.కోటి పన్నుల సొమ్ము పక్కదారి!

· State - Telangana · hmtvlive.com

Shorts Eluru: ఏలూరు నగరపాలక సంస్థలో పన్నుల వసూళ్లకు సంబంధించిన నిధులు పక్కదారి పట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సి ఉండగా, దాదాపు రూ.కోటి మేర నిధులు బడా వ్యక్తుల ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. నగరపాలక సంస్థ పరిధిలో పన్నుల వసూళ్లకు సంబంధించిన లెక్కలను పరిశీలించే క్రమంలో ఈ వ్యవహారం బయటపడినట్లు సమాచారం. గత కొంతకాలంగా పన్నుల వసూళ్లకు సంబంధించిన రికార్డులు, రసీదులు సక్రమంగా అందకపోవడంతో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 75 వేల ఇళ్ల అసెస్‌మెంట్లు, వందలాది దుకాణాలు, వాణిజ్య సంస్థల ద్వారా పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ నిధులు నిర్ణీత విధానంలో కార్పొరేషన్ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. అయితే కొంతమంది సిబ్బంది వసూలు చేసిన మొత్తాలను పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయకుండా పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి

Original source: hmtvlive.com
Read more on Kaizer News