Kaizer News

మేడిగడ్డ ఏడో బ్లాక్ నిర్మాణానికి రూ.2 వేల కోట్లు!.

మేడిగడ్డ ఏడో బ్లాక్ నిర్మాణానికి రూ.2 వేల కోట్లు!..నిపుణుల అంచనా.. అక్టోబర్ 15 నాటికి ప్రాథమిక డిజైన్లు

· State - Telangana · v6velugu.com

హైదరాబాద్, వెలుగు: కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసి మళ్లీ అందుబాటులోకి తేవాలంటే రూ.2 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. నాణ్యతా లోపంతో కుంగిన 7వ బ్లాక్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా కూల్చివేసి కొత్తగా నిర్మించాల్సిందేనని ఇప్పటికే నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ తుది నివేదికలో స్పష్టం చేసింది. ఎన్​డీఎస్​ఏ సూచనల మేరకే బ్యారేజీల్లో సెంట్రల్​ వాటర్​ అండ్​ పవర్​ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్​ఎస్​)తో టెస్టులు చేయించి రిపేర్లు చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. .అందులో భాగంగానే ఇరిగేషన్​ శాఖలోని సెంట్రల్​ డిజైన్స్ ఆర్గనైజేషన్ పునరుద్ధరణ డిజైన్లపై కసరత్తులు చేస్తున్నది. వచ్చే నెల 15 నాటికి ప్రాథమిక డిజైన్లను ప్రభుత్వానికి అందించే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. అయితే, సీడబ్ల్యూపీఆర్​ఎస్​ టెస్టుల రిపోర్టుల కోసం ఇరిగేషన్​ అధికారులు వేచి చూస్తున్నట్టు సమాచారం. ఆ రిపోర్టు వచ్చాక డిజైన్లను ఖరారు చేసి.. వాటిని ఎన్​డీఎస్​ఏ అనుమతి కోసం పంపించనున్నారు. మేడిగడ్డ రిపేర్ల ఖర్చులు భారంగా మారుతున్నాయి. పాత (బ్యారేజీల నిర్మాణ సమయంలో) స్టాండర్డ్​ షెడ్యూల్​ ఆఫ్​ రేట్స్ ప్రకారం ఒక్క ఏడో బ్లాక్​ను తీసేసి కొత్తగా నిర్మించేందుకు రూ.800 కోట్లు అవుతాయంటున్నారు. అయితే, అప్పటికీ ఇప్పటికీ ధరల్లో భారీ మార్పు కనిపిస్తున్నది. కొత్త ఎస్​ఎస్​ఆర్ ప్రకారమైతే ఏడో బ్లాక్​ నిర్మాణానికి రూ.2 వేల కోట్లు అవుతాయని స్పష్టం చేస్తున్నారు. పెరిగిన ఇసుక, స్టీల్, సిమెంట్ ధరలకు అనుగుణంగా ధరలు మారుతాయని చెబుతున్నారు. ఇప్పుడున్న మొత్తం బ్లాక్​ను తొలగించడం అత్యంత క్లిష్టమైన పని అని అంటున్నారు. అయితే, డిజైన్లలో మార్పులు వచ్చి సీకెంట్​పైల్స్​ను మరింత పటిష్టం చేయాల్సి వస్తే మాత్రం ఖర్చు మరింత పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఖర్చు ఒక ఎత్తైతే.. అసలు ఆ ఖర్చు ఎవరు భరించాలన్నది ఇప్పుడు అసలైన సమస్యగా మారింది. డిఫెక్ట్​ లయబిలిటీ పీరియడ్​లోనే సమస్యలు రావడం.. మెయింటెనెన్స్​ పీరియడ్​లోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వంటి కారణాల నేపథ్యంలో మేడిగడ్డను నిర్మించిన ఏజెన్సీ ఎల్​అండ్​టీతోనే చేయించాలని తొలుత నిర్ణయించారు. అందుకు అనుగుణంగా సంస్థకూ తాకీదులు ఇచ్చారు. కానీ, ఆ సంస్థ మాత్రం లొంగట్లేదు. అడుగడుగునా కొర్రీలు పెడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మేడిగడ్డ పునరుద్ధరణపై అదే ఏజెన్సీతో పనిచేయించాలా లేదంటే మరో సంస్థకు అప్పగించాలా అన్న డైలమాలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ రెండూ కాని పక్షంలో ప్రొవిజనల్ అగ్రిమెంట్​దిశగానూ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన ఆ సంస్థకు దాని గురించిన లోటుపాట్లు తెలిసుంటాయని, ఈ నేపథ్యంలోనే ఆ పాత ఏజెన్సీ అయిన ఎల్​ అండ్​ టీతోనే ప్రొవిజనల్ అగ్రిమెంట్​ చేసుకుని ముందుకు వెళ్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలోనూ ఉన్నట్టు చెబుతున్నారు. కాళేశ్వరం బ్యారేజీల సేఫ్టీని తేల్చేందుకు ఇటీవల ఎన్‌‌‌‌‌‌‌‌జీఆర్‌‌‌‌‌‌‌‌ఐ, సీడబ్ల్యూపీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ శాస్త్రవేత్తలు అత్యాధునిక గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. మేడిగడ్డ 7

Original source: v6velugu.com
Read more on Kaizer News